మా పంటలు కాపాడండి సారూ

Submitted by Ramesh Peddarapu on Thu, 29/09/2022 - 12:04
Sir save our crops

విద్యుత్ సరిగా ఇవ్వక,కాలువ నీరు రాక ఎందుతున్న వరి పొలాలు

పాలక వీడు,సెప్టెంబర్28(ప్రజా జ్యోతి):  పాలకీడు మండలం కోమటికుంట గ్రామంలో నాగార్జునసాగర్ పదవ నెంబర్ కాలువ చివరి భూములైన కోమటికుంట గ్రామ శివారు ప్రాంతంలోని భూములు సాగర్ నీరు రాక కరెంటు సరిగా అందక ఎండిపోతున్న పరిస్థితి నాటు వేసి పులక బారిన తరువాత నీరు రాక పంట పొలాలు ఎండిపోతున్నాయి విద్యుత్తు రోజుకు 12 గంటల అని 10.గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ఉదయం 7 గంటలకు కరెంటు ఇచ్చి సాయంత్రం ఐదు గంటలకి   బంద్ చేస్తున్నారు. మధ్య మధ్యలో బ్రేకులు ఇలా అయితే పంట పొలాలు ఎలా పారేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాగర్ మేజర్ కాలువ గండిపడినప్పటి నుండి ఇప్పటివరకు కరెంట్ సరిగా రాకపోవడం వలన స్థానిక ఎమ్మెల్యే చొరవ తో 17 గంటలు ఇవ్వమని చెప్పగా కనీసం 11 గంటలకు కూడా సరిగా ఇవ్వడం లేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .ఈ రెండు మూడు రోజులైనా కరెంటు 15 గంటలు ఇవ్వాలని ఇస్తేనే తమ పొలాలు బతుకుతాయని లేదంటే ఆ పొలాలన్నీ ఎండిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు విద్యుత్ సరఫరా గురించి పాలకీడు ఏఈ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వకపోగా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఇవ్వాల్సిన కరెంట్ లోనే కోత విధిస్తున్నారని సబ్ స్టేషన్ లో రిపేరు జరిగిన గంటలు కూడా కరెంటు ఇవ్వటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.