పోచంపల్లిలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు

Submitted by krishna swamy on Sat, 17/09/2022 - 12:31
 Prime Minister Modi's birthday celebrations in Pochampally
  • ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ
  • ప్రభుత్వ వైద్యాధికారుల సమక్షంలో మోడీ జన్మదిన వేడుకల కేక్ కటింగ్
  • బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు
  • జెండా ఆవిష్కరించిన పట్టణ అధ్యక్షులు దోర్నాల సత్యం
  • అతిధులుగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కొంతం శంకర్ గౌడ్, జిల్లా కార్యదర్శి చింతల రామకృష్ణ, చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు ముసునూరి యాదగిరి, జిల్లా మహిళ మోర్ఛా ఉపాధ్యక్షులు సుశీల, సీనియర్ నాయకులు నోముల గణేష్ హాజరు
  • గ్రామ గ్రామన బిజెపి ఆధ్వర్యంలో విమోచన వేడుకలు

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 17 (ప్రజా జ్యోతి)//తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని బిజెపి మండల పట్టణ శాఖల పట్టణ అధ్యక్షుడు దోర్నాల సత్యం ఆధ్వర్యంలో పద్మనగర్ చౌరస్తాలో జాతీయ పతాకం ఆవిష్కరణ  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కొంతం శంకర్ గౌడ్, జిల్లా కార్యదర్శి చింతల రామకృష్ణ, చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు ముసునూరి యాదగిరి, జిల్లా మహిళ మోర్ఛా ఉపాధ్యక్షురాలు బండిరాల సుశీల సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నోముల గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా జ్యోతి పత్రికతో మాజీ సర్పంచ్ నోముల గణేష్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అశువులు బాసిన అమరవీరులకు జోహార్లు తెలియజేస్తునం అన్నారు. ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో జాగీర్దారులు భూస్వాములు దేశముఖులు పటేల్ పట్వారిల చేతులలో భూమిలు ఉండేవని సామాన్యులకు భూముల లేక కేవలం కౌలుదారులుగానే ఉంటూ భూమి శిస్తూ కట్టుకుంటు సేద్యం చేస్తూ జీవనం సాగిస్తున్న తరుణంలో నిజాం పాలకులు బండరాయి పెట్టి శిస్తు వసూళ్లు చేసేవారు. ఆలాంటి నీరంకుశ నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా గ్రామ గ్రామన నిజాం పాలన అంతం వందిచాలని చెప్పి అమరవీరులు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, రావి నారాయణ రెడ్డి, చింతలపూడి రామిరెడ్డి పోరాడారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమా అని మనకు విమోచనం కలిగింది అన్నారు. జాతిని జాగృతం చేసుకొంటూ జాతి సమైక్యతను కాపాడుకొనే ఉద్దేశ్యంతో ఈ ఉత్సవాలు జరపడం శుభపరిణామం అన్నారు.

అనేక పార్టీల రాజకీయ నాయకులు తెలంగాణ విలీనం అని విమోచనం అని అనేక రకాలుగా పెరు పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టుస్తున్నారు అన్నారు. ఏదీ ఏమైనా ముమ్మాటికీ విమోచనం దినోత్సవం బీజేపీ పార్టీ ఘనంగా నిర్వహిస్తుంది అన్నారు. అలాగే జిల్లా కార్యదర్శి చింతల రామకృష్ణ మాట్లాడుతూ బిజెపి నాయకత్వంలో విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం అమరవీరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. కొన్ని పార్టీలు వారి స్వార్థం కోసం వేడుకలు వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ  జన్మదినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి  కొంతం శంకర్ జిల్లా కార్యదర్శి చింతల రామకృష్ణ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బండిరాల సుశీల జిల్లా చేనేత సెల్ కన్వీనర్ ముసునూరు యాదగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శేఖర్ సీనియర్ నాయకులు నోముల గణేష్, రచ్చ సత్యనారాయణ, భారత లక్ష్మణ్, చేరాల లింగయ్య, వంగూరి రాజు, పట్టణ ఓ బి సి మోర్చా అధ్యక్షుడు గంగాపురం శ్రవణ్, పట్టణ యువమోర్చా అధ్యక్షుడు వంగూరి సిద్దు, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మోటాపురం రవి, తాటి శ్రీహరి, రవి, లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.