అలంపూర్: సెప్టెంబర్ 10(ప్రజా జ్యోతి) ఐజ మండలం తూముకుంట గ్రామంలో ఐజ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ రఘునాథ్ రెడ్డి మామ అయిన శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి (వయసు83) ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు ఎమ్మెల్యే అబ్రహం వారి ఇంటికి వెళ్ళి వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు
అదే గ్రామంలో ఆనందం అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఎమ్మెల్యే అబ్రహం వారి ఇంటికి వెళ్ళి వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు దహన సంస్కారాల కొరకు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయనీ ఎమ్మెల్యే అందించారు ఎమ్మెల్యే వెంట మాజీ సింగల్ విండో ఛైర్మెన్ రాముడు కేశావరం సీతారాం రెడ్డీ మాజీ సర్పంచ్ అనంత రెడ్డీ మాజీ ఉప సర్పంచ్ దేవాన్న గోపాల్ దీన్నే రవి మరియు తదితరులు ఉన్నారు.