గ్రామ పంచాయతీల్లో పర్యటిస్తూ పలు అభివృద్ది పనులను పరిశీలించిన ఎంపీడీవో వేణుమాధవ్

Submitted by Degala Veladri on Wed, 21/09/2022 - 08:40
MPDO Venumadhav visited the village panchayats and inspected many development works

గ్రామ పంచాయతీల్లో పర్యటిస్తూ పలు అభివృద్ది పనులను పరిశీలించిన ఎంపీడీవో వేణుమాధవ్

బోనకల్, సెప్టెంబరు 20, ప్రజాజ్యోతి:

మండల పరిధిలోని చొప్పకట్లపాలెం, రాపల్లి, చిరునోముల, గ్రామాలలో మంగళవారం ఎంపిడిఓ వేణుమాధవ్ విస్తృతంగా పర్యటించారు. తన పర్యటనలో భాగంగా శానిటేషన్, డ్రై డే కార్యక్రమల పని తీరు పరిశీలించారు అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేస్తూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాత టైర్లు వాడి పడేసిన కొబ్బరి బోండాలు నీళ్లు నిలువ ఉండకుండా చూడాలని ప్లాస్టిక్ కవర్లు మూతలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని దోమలకు నీటి స్థావరాలు లేకుండా నీటి తొట్టిలో నీటి నిల్వలు లేకుండా చేయాలని డెంగ్యూ మలేరియా నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు, అనంతరం, చిరునోముల, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు,ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.