ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారం మరువలేనిది -ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్

Submitted by krishna swamy on Tue, 20/09/2022 - 10:36
MLA Filela Sekhar Reddy's contribution is unforgettable - MPP Yarkala Sudhakar Goud

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి)../ ప్రజా సేవ కోసం నిత్యం పరితపించేఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి  సహకారం మరువలేనిది అని ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో బిబినగర్ మండలంలోని శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొల్లెగూడం పి.ఎస్, మగ్ధుoపల్లి పి.ఎస్, మగ్ధుoపల్లి జడ్పీహెచ్ఎస్ రావిపాహడ్ పి.ఎస్ మరియు మాదారం పి.ఎస్లలో  అల్పాహార పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాగిజావను పిల్లలకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్. ఈ సందర్భంగా వంట మనిషి వేతనం కొరకు గొల్లగూడెం గ్రామంలో 3500 మగ్ధుoపల్లి గ్రామంలో 33000 రావిపహాడ్ గ్రామంలో 3500 రూపాయలు మాదారం గ్రామంలో  13000 రూపాయలు ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్ సభ్యులు, తెరాస నాయకులు విరాళంగా ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జిట్టా రజిత అమరేందర్ గొల్లగూడెం సర్పంచ్ గుండెబోయిన రమేష్  మగ్ధుoపల్లి సర్పంచ్ పిష్క లక్ష్మి లక్ష్మీనారాయణ, రావిపహాడ్ సర్పంచ్ అవుర్ల పద్మ శ్రీశైలం మాదారం సర్పంచ్ మందడి అలివేలు రాంరెడ్డి మాజీ వైస్ ఎంపీపీ కొంతం లింగయ్య గౌడ్ మాజీ ఎంపీటీసీ ఒగ్గు పాండు  మాదారం ఉపసర్పంచ్  పంజాల సతీష్ గౌడ్ మగ్ధుoపల్లి ఉపసర్పంచ్ నరేష్  మాజీ ఉపసర్పంచ్ భాస్కర్ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వార్డ్ సభ్యులు,  తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.