మహిళలకు జనగామ కలెక్టర్ క్షమాపణలు చెప్పాలి .సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సింగారపు రమేష్

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:50
Janagama collector should apologize to women .Singarapu Ramesh is the member of CPM district executive committee


దేవరుప్పుల సెప్టెంబర్ 21, ప్రజాజ్యోతి:-    జనగామ కలెక్టర్ శివలింగయ్య నిన్న ఆడవాళ్ళ పై చేసిన అనుచిత వాక్యాలను నిరసిస్తూ ఈరోజు సిపిఎం నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. పోలీసులు దేవరుప్పుల మండల సిపిఎం నాయకులను బుదవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా  సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సింగారపు రమేష్ మాట్లాడుతూగత నాలుగు సంవత్సరాల క్రితం మూడవవిడత  ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులను పాదయాత్రగా వెళ్లి జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య ను అడుగగా మహిళల పట్ల దురుసుగా మాట్లాడారని, మహిళలందరు కలిసి అడుగగా తప్పించుకొని ఇంట్లోకి వెళ్లారనిఈ దృశ్యాన్ని చూసిన మిగతా అధికారులు ముక్కున వేలేసుకున్నారని, అందుకు నిరసనగా అన్నిమండలాలలో నిరసన కార్యక్రమాలు జరపాలని సిపిఎం పార్టీ ఆద్వర్యంలో పిలుపునిచ్చిందని,అందుకు నిరసన తెలిపేందుకు  సిపిఎం నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని, అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్ ప్రతిమండలానికి ఒక్కరిని ఏజెంట్ ను నియమించుకొని అక్రమంగా భూములను అమ్ముకుంటున్నారని..అందుకు నిదర్శనమే మండలంలోని నీర్మాల గ్రామంలో రెండు సర్వే నెంబర్లతో 3 ఎకరాల భూమిని ఓ ప్రయివేటు వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సెటిల్మెంట్ చేసుకున్నాడని అలాంటి భూములు ధరణిలో చేర్చుకోనివి ఈ మండలంలో ఇంకా ఎన్నోఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే ఏ ఒక్క సమస్యకు కూడా పరిష్కరించలేదని..ఈ సమస్యలను అడగడానికి మేము కలెక్టర్ దగ్గరకు వెళ్తే దురుసుగా ప్రవర్తించడాని, ఆ మాటలను వెనెక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని, అదేవిదంగా ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని.డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ప్రజా నాట్యమండలి జిల్లా నాయకులు ఇంటి వెంకటరెడ్డి, నీర్మాల సిపిఎం గ్రామ కార్యదర్శి పయ్యావుల భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.