శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా 100 డేస్ ప్రోగ్రాం

Submitted by Guguloth veeranna on Sat, 26/11/2022 - 16:58
A grand 100 days program at Sri Chaitanya School

పాల్వంచ, నవంబర్ 26, ప్రజాజ్యోతి : పట్టణ పరిధి కాంట్రాక్టర్స్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం ఘనంగా 100 డేస్ ప్రోగ్రాంను జరుపుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలోని 100 రోజులలో విద్యార్థులు నేర్చుకున్న విషయాలను, వారు సాధించిన విజయాలను, చదువులో వారు రాణిస్తున్న తీరును గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ షేక్ ఇస్మాయిల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు 100 రకాల వేషధారణలో వచ్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఇస్మాయిల్, ఇన్చార్జి శిరీష, కో ఆర్డినేటర్ జయశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.