విద్యుత్ మోటార్ వైర్లు, స్టార్టర్ లు పోయాయని రైతులు పిర్యాదు

Submitted by Ramesh Peddarapu on Sat, 24/09/2022 - 11:51
Farmers complained that electric motor wires and starters were lost

కేసు దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకుంటాం యస్ ఐ సైదులు

పాలక వీడు,సెప్టెంబర్23(ప్రజా జ్యోతి): పాలకీడు మండలంలోని రైతాంగాన్ని దొంగల బెడద వెంటాడుతుంది. పంట పొలాల వద్ద ఉన్న  కరెంటు మోటార్లకు, స్టార్టర్లకు, భద్రత లేకుండా పోయింది. అసలే కరెంటు సక్రమంగా అందక, నాగార్జునసాగర్ నీటికి అంతరాయం ఏర్పడి నానా అవస్థలు పడుతుంటే, ఇవి చాలావన్నట్టు దొంగలు మోటార్ వైర్లను స్టార్టర్లను దొంగలిస్తున్నారు. గురువారం రాత్రి  బొత్తలపాలెం, నాగిరెడ్డిగూడెం గ్రామ శివారు ప్రాంతాల్లోని సుమారు పదిమంది రైతుల పంట బావులు, బోర్ల వద్ద కేబుల్ వైర్లును దొంగలించారు. కన్నా రెడ్డి అనే రైతు బోర్ వద్ద స్టార్టర్ పెట్టెని, అంతటితో ఆగని కేటుగాళ్లు  గంగమ్మ తల్లి దేవస్థానంలో  వైర్లను సైతం మాయం చేశారు. బాధిత రైతులు స్థానిక పాలకీడు  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  రైతులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఎస్ఐ సైదులు గౌడ్ ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఘటన జరిగిన బోరు బావులను పరిశీలించారు. ప్రధాన రహదారి వెంట ఉన్న పంట పొలాలలో దొంగతనం జరిగినందున సదరు గ్రామాల్లోని రైతులు అనుమానస్పదంగా, కొత్త వ్యక్తులు ఎవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.