నియోజకవర్గ అభివృద్దే ప్రధాన లక్ష్యం - ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి

Submitted by kareem Md on Mon, 19/09/2022 - 12:08
 Constituency development is the main objective - MLC MC Kotireddy

ఫోటో రైటప్: ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి.
హలియా,సెప్టెంబర్18(ప్రజా జ్యోతి): 
నాగార్జనసాగర్ నియోజకవర్గ అభివృద్దే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నాని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. ఆదివారం నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతు నియోజకవర్గంలో దీర్ఘకాలం పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్యలను సీఎం కేసీఆర్ జిల్లా జగదీశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గ అభివృద్ధిలో బాగంగా నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల కోసం 600 కోట్ల రూపాయల మంజూరు చేసి,పనుల ప్రారంభించినట్లు తెలిపారు.హాలియా పట్టణ కేంద్రంలో డిగ్రీ కళాశాలను, నందికొండ మున్సిపాలిటీలో పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఆగస్టు 2021 లో ముఖ్యమంత్రి నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనకు విచ్చేసి నియోజకవర్గంలో ఏడు మండలాల్లోని సమస్యల పరిష్కార నిమిత్తం హామీ ఇచ్చి ఆ పనులు పూర్తి కొరకు 120 కోట్ల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.

పనులు ప్రారంభించడానికి అనుమతి ఇవ్వడంతో సీఎం కెసిఆర్ విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.  టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ,అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతున్నారని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూర్య భాష్య నాయక్,ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్,కెతావత్,భరత్ రెడ్డి,  నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.