డెక్కన్ సిమెంట్స్ లో బతుకమ్మ పండుగ సంబరాలు

Submitted by Ramesh Peddarapu on Tue, 27/09/2022 - 15:53
 Bathukamma festival celebrations at Deccan Cements

పాలక వీడు,సెప్టెంబర్26(ప్రజా జ్యోతి): ఆదివారం రోజు దసరా పండుగలో భాగమైన బతుకమ్మ పండుగను పురస్కరించుకొని, సూర్యాపేట జిల్లా, పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్, భవానిపురం కర్మాగారం  నందు బ్రతుకమ్మ పండుగను కాలనీ మహిళలు, పిల్లలు,పెద్దలు, అందరు కలిసి ఎంతో ఘనంగా నిర్వహించారు.,ఇట్టి కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంస్థ వైస్ ప్రెసిడెంట్  యన్.శ్రీనివాస రాజు, సీ.జి.యం.  నాగ మల్లేశ్వర రావ్  లు మన తెలంగాణ మహోన్నత సంప్రదాయక  పండుగ బ్రతుకమ్మ విశిష్టతను,పవిత్రత గురించి అందరికీ వివరించారు. తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ, ఇట్టి కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్స్ అధికారులు అయిన  మస్తాన్, కే. యల్. నరసింహ రావ్, పి.యస్.రావ్ , నరసింహ రెడ్డి , గుడి కమిటీ సభ్యులు ఫణికృష్ణ, నాగేశ్వర్ రావు , కాలం చంద్ర శేఖర్  తదితరులు  పాల్గొన్నారు.