అంగన్ వాడి టీచర్, ఆయల సేవలు వెలకట్టలేనివి

Submitted by sridhar on Tue, 06/09/2022 - 16:38
Angan wadi teacher, her services are priceless

 

  • ప్రజల్లో తలలో నాలుకలా అంగన్వాడి టీచర్లు ఆయాలు
  • కరోనా సమయంలో అంగన్ వాడిల టీచర్ల సేవలు వెలకట్టలేనివి
  • ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేయాలి
  •  260 మంది కిశోర బాలికలకు పౌష్టికాహార ఆహారం కిట్టు పంపిణీ చేశారు. 
  • గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:- గత ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో వెట్టి చాకిరి చేయించుకొని శ్రమ దోపిడీకి గురి చేశారని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విమర్శించారు.  స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడి కార్యకర్తలు నుంచి అంగన్వాడి టీచర్లుగా ప్రమోట్ చేస్తూ గౌరవం పెంచారని పేర్కొన్నారు. ఈ మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ప్యారడైజ్ ఫంక్షన్  హాల్ లో కిషోర్ బాలికలకు పౌష్టికాహారం ఆహారం పంపిణీ కార్యక్రమాని నిర్వహించారు ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి   చేతుల మీదుగా 260 మంది కిశోరబాలికలకు (చిన్నారులకు)  పౌష్టికాహారం కిట్ల పంపిణీతో పాటు అంగన్వాడి టీచర్లకు యూనిఫాం చీరలను అందజేశారు. 

 ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా అంగన్వాడి టీచర్లు మరియు ఆయాలను గుర్తించిందని తెలియజేశారు అదేవిధంగా మీ పనిని గుర్తిస్తూ ఎనిమిదేళ్ళ కాలంలో రెండు సార్లు వేతనాలు పెంచడం జరిగిందనీ తెలిపారు.  గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లు ప్రజల తలలో నాలుకలాగా పని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో మీ పాత్ర చాలా కీలకమని స్పష్టం చేశారు,

 అదేవిధంగా చిన్నారులను మరియు కిశోర బాలికలను సంరక్షించాల్సిన బాధ్యత అంగన్వాడి టీచర్ల పైన ఉందని అన్నారు, కరోనా వంటి విపత్కర పరిస్థితిల్లో అంగన్వాడి టీచర్లు ప్రాణాలకు తెగించి ఇంటింటి సర్వే చేశారని, వారి సేవలను కొనియాడారు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులను సమన్వయం చేస్తూ ప్రతి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందేలా చూడాలని పేర్కొన్నారు, మీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకుంటుందని, అంగన్వాడి టీచర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మరియు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు, అన్ని విధాలుగా అంగన్వాడి టీచర్లకు ఒక అన్నగా అండగా ఉంటానని ఏ సమస్య అయినా నా దృష్టికి తీసుకువస్తే వాటిని వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

  ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ , వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ లు  ప్రతాప్ గౌడ్, విజయ్, మనోరమ్మ, కురుమన్న, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ముషాయిదా బేగం, సిడిపిఓలు, అంగన్వాడి రాష్ట్ర నాయకురాలు, జిల్లా అంగన్వాడి టీచర్ల నాయకురాలు,  అంగన్వాడి టీచర్లు ఆయాలు, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.