తెలంగాణ రక్షణ సమితి (టిఆర్ఎస్) పార్టీలో అజ్మీర రాజశేఖర్ సైన్యం అడుగులు

Submitted by Srikanthgali on Thu, 17/11/2022 - 23:02
తెలంగాణ రక్షణ సమితి (టిఆర్ఎస్) పార్టీలో అజ్మీర రాజశేఖర్ సైన్యం అడుగులు

తెలంగాణ రక్షణ సమితి (టిఆర్ఎస్) పార్టీలో అజ్మీర రాజశేఖర్ సైన్యం అడుగులు.

కొత్తగూడెం క్రైమ్, నవంబర్17, ప్రజాజ్యోతి:

తెలంగాణ రక్షణ సమితి పార్టీ స్థాపించిన అనతికాలంలో ఒక ప్రభంజనంలా తయారు అయిందని పార్టీ వ్యవస్థాపకుడు నరాల సత్యనారాయణ అన్నారు.గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డులో అజ్మీరశేఖర్ నాయకత్వంలో తెలంగాణ రక్షణ సమితి (టిఆర్ఎస్) లో అధిక సంఖ్యలో యువకులు పార్టీ యొక్క సిద్ధాంతాలు, కట్టుబాట్లు, వ్యూహాలు, పధకాలకు ఆకార్షితులై వాటి గురించి తెలుసుకొని పార్టీలోకి చేరడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్బంగా అజ్మీరా శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సమితి భవిష్యత్తులో ముందు తరాలకు ఆదర్శంగా ఉంటుందని భావించి, తెలంగాణ 33 జిల్లాలలో వస్తున్న స్పందనను చూసి భవిష్యత్తులో తెలంగాణ రక్షణ సమితి ప్రత్యామ్నాయ పార్టీగా మారుతుందని, తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉంటుందని భావించి తెలంగాణ రక్షణ సమితిలో మేము అందరం భాగం అవుతున్నట్లు ఆయన అన్నారు. రానున్న రోజులు తెలంగాణ రక్షణ సమితి ఆశయాలకు ప్రతి ఒక్కరు తెలుసుకొని అధిక సంఖ్యలో పార్టీలో చేరికలు జరగడం ఖాయం అని ముక్తకంఠంతో చెప్తున్నా అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేసె పార్టిగా ఉంటుందని ప్రజలు కోరుకుంటూన్నా తెలంగాణ నిర్మాణం కేవలం టి ఆర్ ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యం అని అన్నారు. పార్టీ వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ తెలంగాణ ప్రజల సమస్యలను, వారి బాధలను ప్రత్యక్షం గా తేలిసినవారు అందుకే ఆయనతో అడుగులు కలుపుతూ మా వంతుగా పార్టీని, సిద్ధాంతాలను గౌరవిస్తూ పార్టీ లో చేరడం జరిగింది అన్నారు.