విద్య వైద్యం ఉపాధి కల్పించడమే లక్ష్యం

Submitted by kareem Md on Mon, 26/09/2022 - 13:27
 The aim is to provide education, health and employment

విద్య వైద్యం ఉపాధి కల్పించడమే లక్ష్యం
- ఎంపీ, ఓ బి సి మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్
ఫోటో రైటప్: వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ లక్ష్మణ్

హలియా,సెప్టెంబర్25(ప్రజా జ్యోతి):  ప్రతి పేదవాడికి ఉచిత విద్య వైద్యం ఉపాధి కల్పించడమే లక్ష్యమని బిజెపి ఓ బి సి మోర్చా జాతీయ అధ్యక్షుడు,ఎంపీ డా. లక్ష్మణ్ అన్నారు.ఆదివారం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని   విబీనగర్ లో ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నివేదితా రెడ్డి  బిజెపి ఓ బి సి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్యా శిబిరాన్ని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బిజెపి పార్టీ ప్రతి పేదవాడి చదువు విద్య అభివృద్ధి సంక్షేమం కోరుకుంటుందని తెలిపారు. అదేవిధంగా ఎన్ ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నివేదిత రెడ్డి  మాట్లాడుతూ ప్రతి పేదవాడికి విద్య ఉపాధి కల్పించడమే తమ వంతుగా పనిచేస్తామని తెలిపారు.రాబోయే రోజులలో తన వంతుగా సహయ  సహకారాలు ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి,ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు భవాని ప్రసాద్, నిమ్మల రాజశేఖర్,అనుముల మండల అధ్యక్షుడు బైరబోయిన శంకర్,పట్టణ అధ్యక్షుడు నంద్యాల ప్రవీణ్,   ఏరుకొండ నరసింహ,నరేష్ మహిళా మోర్చా అధ్యక్షురాలు గంగా శిరీష,పద్మ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.