సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరం

Submitted by bathula radhakrishna on Thu, 13/10/2022 - 17:57
Yellandu

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసిఐఎల్), అలింకో సంస్థలు,స్త్రీ,శిశు,వికలాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆ్వర్యంలో గురువారం ఇల్లందు మార్కెట్ యార్డ్  నందు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరం నిర్వహించారు.ఈసందర్భంగా ఇల్లందు ఐసిడీఎస్ సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ బిపిల్ కు చెందిన దివ్యాంగులు,విభిన్న ప్రతిభవంతులకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉపకరణాలు,సహాయ పరికరాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో 152 మందికి పరీక్షలు చేయగా 136 మందిని సహాయ ఉపకరణాల కొరకు ఎంపిక అయ్యారని తెలిపారు.ఈకార్యక్రమంలో ఈసిఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.వేణు బాబు,పర్సనల్ ఆఫీసర్ జె.సునీల్ కుమార్,ఆలింకో పి అండ్ ఓ స్వస్తి స్వరూప్,ఆడియోలోజిస్ట్ సౌందర్య రాజ్,వర ప్రసాద్,నరేష్,ప్రవీణ్,సూపర్ వైజర్లు,అంగన్ వాడి టీచర్లు, వికలాంగులు పాల్గొన్నారు.

 

Tags