"భగత్ సింగ్ జయంతి ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి" ----- ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్

Submitted by Kramakanthreddy on Sat, 24/09/2022 - 13:22
"Government should officially organize Bhagat Singh Jayanti" ----- AISF District President Laxman

"మహబూబ్ నగర్ అర్బన్ మండల తహశీల్దార్ పార్థ సారథి కి అందజేసిన వినతిపత్రం"

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 23 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ వర్ధంతి ,జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని, స్వాతంత్ర్యo కోసం  పోరాటం చేసిన భగత్ సింగ్ కి భారత రత్న ప్రకటించాలని,తెలంగాణ ప్రభుత్వం భగత్ సింగ్ విగ్రహాన్ని టాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని అదేవిధంగా భగత్ సింగ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మహబూబ్ నగర్ తహసిల్దార్  పార్థసారధిని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్ సింగ్ పాత్ర ఎంత కీలకమైందో మనందరికీ విధితమేనని, అంతటి మహోన్నతమైన భగత్ సింగ్ చరిత్ర యావత్తు సమాజానికి తెలిసే విధంగా పాఠ్యాంశంలో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా లిఖించడంతో పాటు భగత్ సింగ్ జయంతి(సెప్టెంబర్ 28), వర్దంతి(మార్చి 23)లను  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (AISF) మహబూబ్ నగర్ మండల సమితి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎం ఆర్ ఓ కి వినతిపత్రాన్ని అందజేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అధ్యక్షుడు ఏఐఎస్ఎఫ్ లక్ష్మణ్ ,టౌన్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, నాయకులు మధు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.