ఊరూరా వెలివాడలో వనభోజన కార్యక్రమాల్లో పాల్గొన్న గాదరి కిషోర్

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 12:24
Gadari Kishore who participated in Van Bhojan programs in Urura Weliwada

మునుగోడు సెప్టెంబరు 28(ప్రజా జ్యోతి):   తె లంగాణ పార్టీ  అధ్వర్యంలో దళిత వాడలో కుటుంబ సభ్యుల  వన భోజన కార్యక్రమాలు మునుగోడు మండల వ్యాప్తంగా మునుగోడు తో పాటు 10 గ్రామాల్లో నిర్వహించడం జరిగినది. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ పలు గ్రామాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రతి దళిత వాడల్లో కలియతిరిగి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు  వివరించారు.దళిత వాడల్లో వున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తదనంతరం మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో దళితులకు అభివృద్ధి జరుగుతుందని, దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రం ఒక దిక్కు పోతా ఉంటే మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా మన ఆత్మగౌరవాన్ని  కేంద్ర్రభుత్వానికి తాకట్టుపెట్టి 22 వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయాడు అన్నారు. కెసిఆర్ తలపెట్టిన ప్రతి పథకం అమలు అయ్యిందని వాపోయారు.ఈ కార్యక్రమములో మునుగోదు ఎంపీపీ కర్నాటి స్వామి తెరాసా మండల పార్టీ అధ్యక్షుడు బండా పురుషోత్తం రెడ్డి,  ఉజ్వల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు.బొడ్డు.నాగరాజుగౌడ్ టి ఆర్ ఎస్వి  రాష్ట్ర నాయకులు సిర్గమళ్ళ కిషోర్, పగిల్ల సతీష్, ఈద శరత్ ,బాబు, దుబ్బ రవివర్మ ఏరుకొండ. నాగరాజు వార్డు మెంబర్లు పందుల నరసింహ, కుమారస్వామి, పెరుమాల్ల ప్రణయ్ ,ఎర్పుల స్వామి, తెరాసా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.