మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ. మహబూబాబాద్, డిఎఫ్ ఓ, నాగమణి

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:41
 Free distribution of fry to fishermen.  Mahabubabad, DFO, Nagamani

   కొత్తగూడ సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి ) ,,../ మత్స్యకారుల ఆర్థికా అభివృద్ధి కోసమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని ,  మహబూబాద్ జిల్లా డిఎఫ్ఓ నాగమణి అన్నారు. బుధవారం కొత్తగూడ మండలంలోని పోగుళ్లపల్లి, మొoడ్రాయి గూడెం , మోకాళ్లపల్లి, గ్రామపంచాయతీ పరిధిలోగల చెరువులకు, పోగుళ్లపల్లికి 215000 చేప పిల్లలు, మొడ్రాయిగూడెం గ్రామ పంచాయతీకి 100000 చేప పిల్లలను పంపిణీ చేశారు.        డి ఎఫ్ ఓ నాగమణి మాట్లాడుతూ ఇప్పుడు ఊరురా చేపలు దొరుకుతున్నాయని మత్స్యకారుల కుటుంబాలు బాగుపడుతున్నాయి ఆర్థికంగా ఎదుగుతున్నారని ఊళ్ళల్లో మంచి చేపలు ఆహారంగా అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఆంధ్ర నుంచి చేపలు దిగుమతి అయ్యేవి కానీ నేడు  సీఎం కేసీఆర్ తీసుకున్న కార్యక్రమం వల్ల చేప పిల్లలు పంపిణీతో ఇక్కడే విరివిగా చేపలు దొరుకుతున్నాయని తెలిపారు. అలాగే ప్రభుత్వం ద్వారా మత్స్యకారులకు వలలు, మోఫైడ్స్, షిప్ మార్కెట్ నిర్మాణం లాంటివి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్లు సురేష్, విష్ణు , పొగుళ్లపల్లి సర్పంచ్, అజ్మీరా మంగమ్మ రవి,ఎంపిటిసి బైరబోయిన సదానందం, మత్స్యశాఖ పోగుళ్ళపల్లి అధ్యక్షుడు  బైరబోయిన రాములు, ఉపాధ్యక్షుడు భైరబోయిన రాజయ్య, కార్యదర్శి శిరబోయిన కొమురయ్య, ముదిరాజ్ పెద్ద మనుషులు బైరబోయిన శ్రీను, బుచ్చి రాములు,నన్నబోయిన, సారయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.