నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి . ఎస్పీ సురేందర్ రెడ్డి

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 17:54
Focus should be on crime control. SP Surender Reddy

ప్రజలకు పారదర్శక సేవలందించాలన్న ఎస్పి
పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచన. పోలీసు అధికారులతో ఎస్పి  నేర సమీక్షా సమావేశం.        
       

భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్20 ప్రజాజ్యోతి../  నేరాల నియంత్రణపై  ప్రత్యేక ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటిని అదుపు చేయడానికి మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని  జిల్లా ఎస్పి  సురేందర్ రెడ్డి అధికారులకు సూచించారు.మంగళవారం జిల్లా పోలీస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో  నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  జిల్లాలో నేరాల నియంత్రణ, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, పెండింగులో ఉన్న కేసుల వివరాలను ఎస్పి గారు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్  కేసులను తగ్గించేందుకు అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని పేర్కొన్నారు. అలాగే వ్యవస్థీకృత నేరాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సిసి టీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో  సిసి కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా పోలీసు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా  నాణ్యమైన, సత్వర సేవలు అందించాలని, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలని, కేసుల దర్యాప్తులో అలసత్వం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎస్పి  హెచ్చరించారు.  ఈ సమీక్షా సమావేశం లో అదనపు ఎస్పీ వి శ్రీనివాసులు, కాటారం, భూపాలపల్లి, డిఎస్పీలు బోనాల కిషన్, ఏ రాములు, డిఎస్పి కిషోర్ కుమార్, ఇన్స్పెక్టర్లు రాజిరెడ్డి, వాసుదేవరావు, పెద్దన్న కుమార్, పులి వెంకట్, కిరణ్, రంజిత్ కుమార్, సతీష్, జిల్లా పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.