ప్రజలను చంపిన రోజు పండుగ జరుపుతారా

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 17:14
 Do you celebrate the day when people are killed?

 మహబూబాబాద్ తొర్రూరు సెప్టెంబర్ 17 (ప్రజా జ్యోతి) .  యూనియన్ సైన్యం నైజాం నవాబు రజాకార సైన్యం తెలంగాణ ప్రజలపై దాడులు చేసి అమానుషంగా 4000 మందిని చంపితే అది పండుగ రోజు ఎలా అవుతుందని సిపిఐ (ఎంఎల్ )ప్రజాపందా తొర్రూర్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. తొర్రూర్ ప్రజాపంద పార్టీ కార్యాలయం ముందు నేడు పార్టీ ఆధ్వర్యంలో విద్రోహ దినాన్ని జరిపారు 1948 సెప్టెంబర్ 17న ఒక్క తుపాకీ తూటా పేలకుండానే నైజాం నవాబు ఇక్కడి భూస్వాముల ఒత్తిడితో యూనియన్ సైన్యానికి లొంగిపోయి తెలంగాణ ప్రాంత ప్రజలపై రాక్షస దమనకాండము జరిపిన రోజు విలీనమ?విముక్తా?ప్రజల ఆలోచించాలని ఆయన అన్నారు. 3000 గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకొని 10 లక్షల ఎకరాల భూములు సాగు చేసుకుంటున్నా రైతాంగం సంతోషం ఎక్కువ కాలం నిలవకుండా యూనియన్ సైన్యం జరిపిన దాడులలో వేలాదిమంది మట్టి మనసులు అన్యాయంగా చనిపోతే చరిత్ర తెలవని బిజెపి టిఆర్ఎస్ లు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. ముస్లిం రాజుల బూచితో బిజెపి పార్టీ చరిత్రను వక్రీకరించ చేస్తున్న కుట్రలు ప్రజానీకం ముక్తకంఠంతో తిరస్కరించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వంద అవకాశ విధానాలతో తెలంగాణ ప్రజల పోరాట చరిత్రను గుర్తించనిరాకరిస్తుందని అన్నారు.నాటి భూస్వాములు దొరలు హిందూమతంలో ఉండి ప్రజలను హింసించింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సిపిఐ (ఎంఎల్ )ప్రజాపంద సబ్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్నమాట్లాడుతూ తెలంగాణ ప్రజలు త్యాగాలతో సాధించుకున్న హక్కులను భూములను కోల్పోయిన రోజు విద్రోహ దినమేనని ఆయన అన్నారు.నేడు బిజెపి టిఆర్ఎస్ పార్టీలు ఓట్ల రాజకీయాల కోసం ప్రజలను చీల్చడం సరికాదని దీనిని ప్రజలు అర్థం చేసుకొని వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.ఎండి షరీఫ్, మంగళపల్లి ప్రసాద్ దామెర వెంకన్న లకావత్ బీమా గుగులోతు వెంకన్న రవి సంతోష్ బొమ్మర వేణు కుమార్ గుద్దేటి సంపత్ జస్వంత్ వీరన్న శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.