మళ్లీ అదే తీరు... విచారణ పూర్తి కాకముందే పోస్టింగ్... నివేదిక పెండింగులో ఉండగా డిప్యూటేశన్... పని చేస్తున్న సిఈఓ ఉండగా మరో వ్యక్తికి పోస్టింగ్... డిసిసిబిలో వింత వైఖరి... చైర్మన్ పాత్రపై అనుమానాలు...

Submitted by SANJEEVAIAH on Sat, 04/05/2024 - 06:55
Photo

మళ్లీ అదే తీరు...

విచారణ పూర్తి కాకముందే పోస్టింగ్...

నివేదిక పెండింగులో ఉండగా డిప్యూటేశన్...

పని చేస్తున్న సిఈఓ ఉండగా మరో వ్యక్తికి పోస్టింగ్

డిసిసిబిలో వింత వైఖరి...

చైర్మన్ పాత్రపై అనుమానాలు...

(నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి - ఎడ్ల సంజీవ్)

"కొత్త సీసాలో పాత సారా" అన్నట్లు డిసిసిబి, డిసిఓ లో వింత వైఖరి కొనసాగుతుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పోస్టింగ్ కో ఉండగానే మరో చోట డీప్యూటేశన్ పేరుతో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ పని చేస్తున్న అసలైన వ్యక్తిని వేరే చోట పోస్టింగ్ ఇవ్వకుండానే ఈ పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. కాసులు చేతులు మారడంతో విచారణ పెండింగులో వుండగానే ఇలా డిప్యూటేశన్ పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడిన చోటికి పోస్టింగ్ ఇవ్వడం కో ఆపరేటివ్ శాఖలో చర్చనియాంశంగా  మారింది. అయితే ఈ వ్యవహారం మొత్తం వెనక డిసిసిబి లో ఇటీవల కీలక భాధ్యతలు చేపట్టిన వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకు ఈ తతంగం ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం.

ఇది కథ...

మాక్లూరు సొసైటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కార్యదర్శి (సి ఈ ఓ) విష్ణు పై అప్పటి పాలక వర్గం చర్యలు చేపట్టింది. ఫలితంగా పలు ఆరోపణలు వెలుగు చూశాయి. దీనిపై అప్పటి డి సి ఓ విచారణకు ఆదేశించారు. ఆ తరువాత సదరు సి ఈ ఓ ను అక్కడి నుంచి తొలగించి నిజామాబాద్ సొసైటీకి పంపించారు. ఇంతవరకు బాగానే ఉన్న ఆ విచారణ సంగతి అటక ఎక్కింది. ఈ విచారణ  పెండింగులో వుండగానే కో ఆపరేటివ్ శాఖలో హెచ్ ఆర్ పాలసి కోసం సి ఈ ఓ లకు అవకాశం వచ్చింది. మొదటి జాబితాలో విష్ణు పేరు రావడం కోసం పెండింగ్ విచారణ పూర్తి చేయాల్సి వచ్చింది. కానీ ఆ విచారణ పూర్తి కాకముందే డిఎల్ఈఎస్ లో జాబితాలో విష్ణు పేరు చేర్చినట్లు తెలిసింది. ఈ సంగతి ఇలా ఉన్నా ఇక్కడి (డిఎల్ఈఎస్) నుంచి పోస్టింగ్ ఇవ్వడమే కొత్త వివాదానికి తెర లేపింది. మాక్లూర్ సొసైటీలో సంతోష్ పని చేస్తుండగా ఆయన స్థానంలో నిజామాబాద్ సొసైటీలో పని చేస్తున్న విష్ణు కు దీప్యూటేశన్ పేరుతో పోస్టింగ్ ఇచ్చారు. వాస్తవానికి ఎక్కడ పని చేస్తున్న వారికే అక్కడే పోస్టింగ్ ఇవ్వాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా నిజామాబాద్ లో పని చేస్తున్న వ్యక్తికి మాక్లూరు లో పోస్టింగ్ ఇచ్చారు. అది కూడా డిప్యూటేశన్ పేరుతో ఇవ్వడంతో శాఖ ఉద్యోగులు నివ్వెర పోయారు. 

"హస్తం" ఎవరిది ?

నిజానికి హెచ్ ఆర్ పాలసీ అమలు కోసం డి ఎల్ ఇ ఎస్ (జిల్లా కమిటీ) కార్యాచరణ చేపట్టింది. పాలసీ అమలు చేయడం జరిగినప్పటికీ ఎక్కడ పనిచేస్తున్న వారికి అక్కడే పోస్టింగ్ ఇవ్వాలి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎక్కడైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నరో అక్కడే పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ వ్యవహారం మొత్తం వెనక ఆర్మూర్ నియోజక వర్గానికి చెందిన హస్తం నేతతో పాటు డి సి సి బి చైర్మన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాసులు చేతులు మారడంతోనే ఈ తంతు కొనసాగుతుందని ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అందలం ఎక్కిస్తున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కో ఆపరేటివ్ శాఖలో అవినీతి అక్రమార్కుల తీరు కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా ఉంది.

ఎన్నికల కోడ్..?

ఉన్నచోట ఉద్యోగం సంగతి ఇలా ఉన్న ఎన్నికల కోడ్ అమలు ఉండగా దిఫ్యూటేశన్ పేరుతో పోస్టింగ్ యివ్వడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు..