
సివిల్ సప్లయి డిఎం గా జగదీష్
నిజామాబాద్, ప్రజాజ్యోతి, జనవరి 18 :
నిజామాబాద్ సివిల్ సప్లై డిఎం గా జగదీష్ కుమార్ నియమితులయ్యారు. ఈమెరకు ఆయన బాధ్యతలను స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా సివిల్ సప్లై డి ఏం పోస్టు గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. డి ఎస్ వో గా విధులు నిర్వహిస్తున్న చంద్ర ప్రకాష్ డిఎం సివిల్ సప్లై ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఎట్టకేలకు సివిల్ సప్లై డి ఏం గా జగదీష్ ను నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ సివిల్ సప్లై డిఎం గా పనిచేసిన ఆయన బదిలీపై నిజామాబాద్ వచ్చారు.
- 166 views