సమిష్టి కృషితో అభివృద్ధి సాధ్యం గ్రామసభ నిర్వహించండి లేదంటే చర్యలు తప్పవు

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 14:40
Development is possible with collective effort Organize the Gram Sabha or else action will be taken

డిఎల్ పిఓ సుధీర్ కుమార్ 

మల్హర్ , సెప్టెంబర్ 29.(ప్రజాజ్యోతి)../.... గ్రామ పంచాయతీ అభివృద్ధి సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భూపాలపల్లి డిఎల్పిఓ సుధీర్ కుమార్ అన్నారు. మండలంలోని తాడిచెర్ల గ్రామ పంచాయతీ లో గురువారం పరిశీలనకు వచ్చిన డిఎల్పిఓ మాట్లాడుతూ అదనపు కలెక్టర్ దివాకర్ ఆదేశాల మేరకు సర్పంచ్ సుంకరి సత్యనారాయణ పై వార్డు సభ్యుల ఫిర్యాదుతో విచారణకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో పాలకవర్గం ఇస్తారాజ్యంగా తీర్మానం లేకుండా గ్రామంలో అభివృద్ధి పనులు నిర్వహించారని. గ్రామసభ నిర్వహించి గ్రామసభ ఆమోదంతో తీర్మానాల ద్వారా పనులు ఎంతవరకు నిర్వహించారో అంతే మేరకు బిల్లులు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి ఆయన సూచించారు. గ్రామసభ నిర్వహించకపోతే స్థానిక సర్పంచ్ సత్యనారాయణ పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ సర్పంచ్ గ్రామ సభ నిర్వహించడం లేదని ఆయన భార్య సర్పంచ్ గా వ్యవహరించడం వార్డు సభ్యులందరినీ ఆవేదన గురి చేయడం జరుగుతుందని డి ఎల్ పిఓ దృష్టికి తీసుకువచ్చారు. ఓపెన్ కాస్ట్లో ముంపుకు గురవుతున్న తాడిచర్ల లో నష్టపరిహారం కోసం  అడ్డగోలుగా నిర్మించిన కొత్త ఇండ్ల లిస్టును గ్రామపంచాయతీ రికార్డులో ఎంటర్ చేయకుండా  సర్పంచ్, ఆయన భార్య ప్రజా ప్రతినిధి హోదాలో వ్యవహరించి గ్రామపంచాయతీ పర్మిషన్ కోసం ఇంటి యజమానుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు వార్డు సభ్యులు డిఎల్పిఓకు తెలియజేశారు.

విచారణ తదనంతరం గ్రామసభ నిర్వహించిక, సంబంధిత బిల్లులకు తీర్మానాల ద్వారా నిధులు డ్రా చేసి చెల్లించకపోతే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సర్పంచ్ పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్పంచ్ స్థానంలో భార్య ప్రజా ప్రతినిధిగా వ్యవహరించడం తగదని ఇకనైనా మానుకోవాలని సూచించారు. అక్రమంగా నిర్మించిన ఇండ్ల వసూళ్ల వ్యవహారంపై జిల్లా స్థాయి అధికారులు దృష్టి సారించారని ఎవరు దోషులైనా సరే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.