విద్యార్థులకు పోటీ పరీక్షల సవాల్‌... స్కూల్ లెవెల్ లో ఒలంపియాడ్‌ విద్యతో సక్సెస్‌... జాతీయ ర్యాంకుల్లో జిల్లా విద్యార్థులు... తల్లిదండ్రులకు సవాల్‌గా మారిన కళాశాలల ఎంపిక....

Submitted by SANJEEVAIAH on Sat, 04/05/2024 - 15:54
photo

సండే స్పెషల్‌

విద్యార్థులకు పోటీ పరీక్షల సవాల్‌... 
ఒలంపియాడ్‌ విధానంతో సక్సెస్‌...
జాతీయ ర్యాంకుల్లో జిల్లా విద్యార్థులు...
తల్లిదండ్రులకు సవాల్‌గా మారిన కళాశాలల ఎంపిక....

(నిజామాబాద్‌ - ప్రజాజ్యోతి విద్యా విద్య విభాగం ` రాజ్‌ కుమార్‌)

ఇప్పుడు చదువంటే మక్కువ ఉన్నస్కూల్, కళాశాల ఎంపికనే సవాల్‌గా మారింది. దీనికి తోడు మారుతున్న జాతీయ విద్యా విధానంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొని మెరిట్‌ సాధించడం ఇంకా సవాల్‌గా మారింది. అయితే ప్రైమరీ నుంచి చదువుకునే విధానంతో పాటు ముఖ్యంగా ఇంటర్మీడియట్‌లో బోధన పద్దతులు, ఒలంపియాడ్‌ విద్యా విధానం అమలులో ఉన్నస్కూల్, కళాశాలను ఎంపిక చేయడం ఇప్పుడు తల్లిదండ్రులకు ముందున్న ఒకేఒక దారి. దీనికి ఈయేడు నిజామాబాద్‌ జిల్లాలో జాతీయ స్థాయిలో ఐఐటీ/జేఈఈ మెయిన్స్‌ ఫలితాలను ఉదహరణగా చెప్పవచ్చు. మంచి కళాశాల, మంచి ర్యాంకులు ఏంత ముఖ్యమో... జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో ర్యాంకులు సాధించి మెరిట్‌లో నిలవడం అంతే ముఖ్యం. ఒక్కసారి తల్లిదడ్రులు ఆలోచించాల్సిన తరుణమిది.

ఇది విషయం...
2024 ఏప్రిల్‌ 24న విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాలలో 1000కి 900 మార్కులు కోన్ని వేల మందికి వచ్చి, అ తర్వాత రోజు 2024 ఏప్రిల్‌ 26న విడుదలైన ఐఐటీ/జేఈఈ 2024 మెయిన్స్‌ ఫలితాల్లో కనీసం అర్హత కూడా సాధించలేని దుస్థితి. ఏందుకని.? విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏమిటీ.? ఈ ఆంశంపై అనేక మంది విద్యావేత్తలు, మేధావులు విశ్లేషణలు చేస్తున్నారు. 2024 ఐఐటీ/జేఈఈ మెయిన్స్‌ ఫలితాలలో మన జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ఉత్తమ పర్సేంటేజీ (టైల్‌), జాతీయ స్థాయిలో వివిధ కేటగీరిలలో ఉత్తమ జాతీయ ర్యాంకులు సాధించిన వారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. ఏందుకు ఈ పరిస్థితి. అంటే ఈ జాతీయ విద్యా విధానంలో ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏలా ఆలోచించాలి అనేది కీలకమైన ఆంశం. పదవ తరగతిలో 9.5, 9.7, 9.8, 10.00 గ్రేడు వస్తే సంతోషమే. కానీ, ఈ గ్రేడులతో పాటు స్కూల్‌ స్థాయిలో ఐఐటీ/ మెడికల్‌ పౌండేషన్‌తో కలిపిన ఒలంపియాడ్‌ విద్యా విధానంలో శిక్షణ ప్రతిరోజు కాలేజీ లెక్చరర్స్‌తో ఇప్పించామా.? లేదా.? అని తల్లిదండ్రులు ప్రశ్నించుకోవాలి. 

స్కూలు స్థాయిలోనే ఐఐటి, మెడికల్ పౌండేషన్‌ అంటే...
వాస్తవానికి ముందు చూపుగా స్కూల్‌ స్థాయిలోనే విద్యార్థులకు ఫౌండేషన్‌ వేయాలి. అది పూర్తి బాధ్యత స్కూల్‌ ఎంపిక చేయడంలో తల్లిదండ్రులపైనే ఉంటుంది. 1) ప్రతిరోజు ఉదయంఅనుభవజ్ఞలైన ఉపాధ్యాయులతో స్కూల్‌ స్థాయిలో రెగ్యులర్‌ సిలబస్‌ బోధించడం. 2) ప్రతిరోజు మద్యాహ్నం ఐఐటీ/ మెడికల్‌ పౌండేషన్‌ కోసం ఇంటర్‌, ఎంసేట్‌ స్థాయి లెక్చరర్స్‌తో ప్రతి సబ్జెక్టుపై ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. వీటి కోసం స్కూల్ లెవెల్లో ప్రత్యేకంగా ఐఐటి, మెడికల్ ఫౌండేషన్ఉన్న ఒలంపియాడ్‌ విధానం ఉన్నస్కూల్, కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది.

తల్లిదండ్రులు ఎలాంటి స్కూల్లో శిక్షణ ఇప్పిస్తున్నారా..?
స్కూల్‌ స్థాయిలో తల్లిండ్రులు ఇలా ఉదయం రెగ్యులర్‌ సిలబస్‌, మధ్యాహ్నం ఐఐటీ/ మెడికల్‌ పౌండేషన్‌, ఇంటర్‌, ఏంసెట్‌  స్థాయి లెక్చరర్స్‌తో ఇప్పించినపుడే జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో రాణిస్తారని పూర్తి విశ్వాసంతో తల్లిదండ్రులు ఆశించవచ్చు. అలా కాకుండా స్కూల్‌ స్థాయిలో ఎస్‌ఎస్‌సి గ్రేడ్‌ మాత్రమే చూసి ఇంటర్మీడియట్‌ స్థాయిలో రాష్ట్ర  స్థాయి టాప్‌ మార్కులు మాత్రమే చూసి తల్లిండ్రుల మురిసిపోతే కుదరదు. జాతీయ ప్రవేశ పరీక్షలైన ఐఐటీ / మెడికల్‌ లలో ఇంటర్మీడియట్‌లో రాణించాలంటే స్కూల్‌ స్థాయిలో ఒలంపియాడ్‌ విద్యతో ఐఐటీ/మెడికల్‌ ఫౌండేషన్‌ శిక్షణ తప్పనిసరి. అప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లల నుండి ఉత్తమ ఫలితాలను ఆశించవచ్చు. ఏందుకంటే వేరే రాష్ట్రాల పిల్లలు, అలాగే మెట్రోపాలిటిన్‌ సీటీల పిల్లలు స్కూల్‌ స్థాయిలోనే ఒలంపియాడ్‌ విద్యతో ఐఐటీ/ మెడికల్‌ ఫౌండేషన్‌ శిక్షణ తీసుకొని ఉంటే వల్ల ఇంటర్మీడియట్‌లో ప్రవేశ పరీక్షలైన ఐఐటీ / మెడికల్‌ లలో అత్యుత్తమంగా రాణిస్తారు. దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో చదివిన పిల్లలతో పాటు మన జిల్లా విద్యార్థులకు కూడా సీట్లు సాధించాలంటే స్కూల్‌ స్థాయిలో ఒలంపియాడ్‌ స్కూల్‌లో రియల్‌ ఐఐటీ / మెడికల్‌తో కలిపి ఒలంపియాడ్‌ అకాడమిక్‌ ప్రోగ్రాం విద్యార్థులకు అమలు పరుచుట తప్పని పరిస్థితి. ఇంటర్‌లో మాత్రమే అతృతపడితే అస్సలు కుదరదు. జాతీయ విద్యా విధానంతో రాణించాలంటే స్కూల్‌ స్థాయిలో మేల్కొనాలి.

జిల్లాలో పరిస్థితి ఇది... 
మన నిజామాబాద్‌లో స్కూల్‌ స్థాయిలో ఒలంపియాడ్‌ విద్యతో ఐఐటీ/ మెడికల్‌ ఫౌండేషన్‌ శిక్షణ రెగ్యులర్‌ సిలబస్‌ తో పాటు శిక్షణ తీసుకోని, ఇంటర్మీడియట్‌ కూడా నిజామాబాద్‌లో చదివిన విద్యార్థులు 2024 ఏప్రిల్‌ 25న  విడుదలైన ఐఐటీ / జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో  ఉత్తమ ఫలితాలు సాథించారు. ఉత్తమ జాతీయ పర్సేంటేజీ (టైల్‌) వివిధ కేటగిరీలలో వారు సాధించిన అలిండియా ర్యాకుంలు , ఇంటీర్మీడియట్‌లో వారు సాధించిన మార్కులు వివరణాత్మకంగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. 

విద్యార్థి పేరు.         -  ఐఐటీ        - ఐపిఈ       - ఐఐటీ

--------------------------------------------------------------------------
ఎండి. మినహాజ్‌     -   99.68   -    934        - 1051
ఎం.సురేష్‌            -   99.41    -    965        - 2092
బి. శివ ప్రతమ్‌      -   99.22    -    987        - 2910
ఎ. మాలిక్‌           -   98.30    -    974         - 7167
ఎ. హాది              -   98.22    -    958         - 7533
ఇలా నిజామాబాద్‌లోనే స్కూల్‌ విద్యపూర్తి చేసుకొని ఇంటర్మీడియట్‌ విద్య కూడా నిజామాబాద్‌లోనే ఒకే ఇంటర్మీడియట్‌ కాలేజీలో ఐఐటీ / మెడికల్‌ కోచింగ్‌ తీసుకోని 2024 ఏప్రిల్‌ 25న విడుదలైన 2024 ఐఐటీ/జేఈఈ మెయిన్స్‌ జాతీయ పరీక్ష ఫలితాల్లో ముందు వరసలో ఉన్నారు. 17 మంది మన నిజామాబాద్‌ జిల్లా విద్యార్థులు 90 శాతం (టైల్‌) పైన జాతీయ పరీక్షల్లో సాధించి వివిధ కేటగీరిలలో 2024 ఐఐటీ/ జేఈఈ మెయిన్స్‌లో అల్‌ ఇండియా ఉత్తమ ర్యాకుంలు 967, 1051, 1220, 2910, 3394, 6011, 7167, 7533, 8653, 9564, 10542, 13846, 15632, 17303, 18446, 19091, 19388, 19678, 23614, 25597, 29232 ర్యాంకులు సాధించడమే కాకుండా నిజామాబాద్‌లోని ఒకే కాలేజీ నుంచి 50 మంది అల్‌ ఇండియా ర్యాంకులు సాధించి ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన 2024 ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్షలకు అర్హత సాధించారు. వీరు స్కూల్‌ విద్య మొత్తం ఇంటర్మీడియట్‌ విద్య మొత్తం నిజామాబాద్‌ లో మాత్రమే చదివారు. ఐఐటీ/ మెడికల్‌ కోచింగ్‌ కూడా నిజామాబాద్‌లోనే శిక్షణ తీసుకున్నారు. కానీ వీరు 2024 ఏప్రీల్‌ 25న విడుదలైన 2024 ఐఐటీ/ జేఈఈ మెయిన్స్‌ దేశ వ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు రాసిన పరీక్ష ఫలితాలలో ముందు ఉన్నారు. డీల్లీ, హైదరాబాద్‌, బెంగళూర్‌, చెన్నై మెట్రోపాలిటీన్‌ సీటీలలో చదివిన విద్యార్థుల కంటే మన జిల్లా విద్యార్థులు చాలా చక్కగా రాణించి జాతీయ స్థాయిలో అత్యుత్తమ పర్సేంటేజీలు, జాతీయ స్థాయిలో అత్యుత్తమ అలిండియా ర్యాకుంలు సాధించారు. కేవలం స్కూల్‌ స్థాయిలో ఒలంపియాడ్‌ విద్యతో ఐఐటీ/ మెడికల్‌ ఫౌండేషన్‌  శిక్షణ తీసుకోవడం వల్లనే ఈ విద్యార్థులకు జాతీయ స్థాయిలో రాణించడం సాధ్యమైంది. కనుక స్కూల్‌ విద్యార్థులు తల్లిదండ్రులారా ఆలోచించండి. జాతీ విద్యా విధానంలో మీ పిల్లలు రాణించాలంటే స్కూల్‌ స్థాయిలోనే రెగ్యులర్‌ సిలబస్‌తో పాటు ప్రతిరోజు ప్రతి సబ్జెక్టుపై ఇంటర్‌, ఏంసెట్‌ స్థాయి లెక్చరర్స్‌తో బోధింపబడే ఒలంపియాడ్‌ విద్యతో ఐఐటీ / మెడికల్‌ ఫౌండేషన్‌ ఉన్న ఒలంపియాడ్‌ స్కూల్స్‌ను మాత్రమే ఎన్నుకోవాలి.
స్కూల్‌ స్థాయిలో వచ్చిన గ్రేడులు ఇంటర్మీడియట్‌లో వచ్చిన టాప్‌ మార్కులు సాధిస్తే సంతోషమే. కానీ, వాటితో పాటు ఇంటర్మీడియట్‌ స్థాయిలో జాతీ విద్య ఐఐటీ / మెడికల్‌ ప్రవేశ పరీక్షలలతో రాణించాలి, అంటే స్కూల్‌ స్థాయి నుంచి ఒలంపియాడ్‌ విద్యతో ఐఐటీ / మెడికల్‌ ఫౌండేషన్‌ స్కూల్‌ శిక్షణ ఒలంపియాడ్‌ స్కూల్‌లలో ఈ నూనత జాతీయ విద్య ప్రకారం విద్య బోధన విద్యార్థులకు తప్పనిసరి.

ఎంపిక కీలకం...
స్కూల్‌ విద్యార్థుల తల్లిదండ్రులారా ఆలోచించండి. స్కూల్‌, కళాశాల ఎంపికనే కీకలంగా మారనుంది. ఎక్కడైతే మన విద్యార్థులు వాస్తవికంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తారో వాటిని ఎంపిక చేసుకోవాలి. సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోని ఇంటర్‌లో మీ విద్యార్థి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన ఐఐటీ/ మెడికల్‌ ప్రవేశ పరీక్షలలో రాణించేటట్లు చూసురోవాలి. ఈ పోటీ ప్రపంచంలో ఎవరికి వారే పోటీ ఎవరికి వారేసాటీ అన్నట్లు స్కూల్ లెవల్లో ఒలంపియాడ్‌ విద్యా విధానం ఇప్పుడు అన్నింటికి ఉత్తమంగా నిలుస్తుంది.