పటన్ తో  పేట్టుకుంటే అంతే మరి... నాతో పెట్టుకుంటే మీ ఇంటికి కరెంటు కట్... ఓ లైన్మెన్  నిర్వాహకం... అనుమతి లేకుండా మీటర్లు మారుస్తున్న ఉద్యోగులు... వినియోగను బెదిరించిన లైన్ మెన్... పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు...

Submitted by SANJEEVAIAH on Sat, 04/05/2024 - 07:20
Photo

పటన్ తో  పేట్టుకుంటే అంతే మరి...

నాతో పెట్టుకుంటే మీ ఇంటికి కరెంటు కట్...

ఓ లైన్మెన్  నిర్వాహకం...

అనుమతి లేకుండా మీటర్లు మారుస్తున్న ఉద్యోగులు...

వినియోగను బెదిరించిన లైన్ మెన్...

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు...

(నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి - ఎడ్ల సంజీవ్)

నాతో పెట్టుకుంటే ఇంటికి కరెంటు ఉండదు ఉన్నవాళ్లు కట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది నేనేంటో జాగ్రత్త.... రా... అంటూ విద్యుత్ వినియోగదారుడిపై ఇష్టం వచ్చినట్లు బండబూతులు తిడుతూ విరుచుకుపడ్డాడు ఓ విద్యుత్ ఉద్యోగి. ఆయన విద్యుత్ శాఖ ఉద్యోగి. చేసేది లైన్మెన్ ఉద్యోగం సరాసరి ఇంటికి వచ్చి ఎవరి అనుమతి లేకుండా కరెంటు మీటరు మార్చేశారు. అప్పటికే విషయం గమనించిన ఇంటి యజమాని అక్కడికి వచ్చి ఇదేమిటి అని ఎవరికి చెప్పకుండా మీటర్ మార్చడం ఏమిటి..? మీకు ఎవరు చెప్పారు అటూ నిలదీశారు
 దీంతో అదేం లేదు మా ఇష్టం పాత మీటర్లు మార్చేస్తున్నాం. అయితే ఏమిటి అన్నారు. అదేమిటి.? మా అనుమతి లేకుండా మా ఇంటి మీటర్ ఎలా మారుస్తారు అని అడిగారు. దీంతో సదరు లైన్మెన్ ఇంటి యజమానిపై దురుసుగా ప్రవర్తించారు. నోటికి వచ్చినట్లు బండ బూతులు తిట్టారు. నాతో పెట్టుకుంటే ఇంట్లో కరెంటు ఉండదు. ఉన్న వైర్లు పీకిపరిస్తే కరెంటు కోసం మళ్ళీ నా చుట్టూ తిరిగితే తెలుస్తుంది రా. ఏమనుకుంటున్నావు నా సంగతి తెలియదు నీకు అంటూ చిందులు తొక్కారు. ఆయన పేరే  పటాన్ నిజామాబాద్ నగరంలోని డి3 సబ్ స్టేషన్ పరిధిలోని లైన్మెన్ గా పనిచేస్తున్నారు. ఈయన తీరు ఆది నుంచి వివాదాస్పదమే అనే విమర్శలు చేస్తున్నారు. దీనిపై బాధితుడు విద్యుత్ శాఖ డీ ఈ ఈకి, నిజామాబాద్ మూడో టౌన్ పోలీసులకు ఏసిపికి ఫిర్యాదు చేశారు. ఈ ఇంటికి వాయిస్ రికార్డు సీసీ కెమెరాలు ఉండటంతో సదరు లైన్మెన్ పటాన్ భగోతం మొత్తం రికార్డు అయింది. ఇంతకు ఈ కథ ఏమిటి అనే కదా అయితే ఈ కథనం చదవాల్సిందే
 ఇది సంగతి....

జరిగింది ఇలా...

నిజామాబాద్ నగరంలోని డి 3 సబ్స్టేషన్లో పఠాన్ లైన్ మెన్ గా పనిచేస్తున్నారు ఏప్రిల్ 30న చంద్రశేఖర్ కాలనీలోని వెంకటనారాయణ ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇంటి బయట బైక్ పార్క్ చేశారు బైకు ఎలాంటి నంబర్ ప్లేటు లేదు. పఠాన్ తో పాటు మరో వ్యక్తి ఇంటి గేటు తీసుకొని లోపలికి వచ్చారు. ఇదంతా సినిమా పక్కిలో వచ్చి గోడపై నున్న మీటర్లు తొలగించారు దాని స్థానంలో కొత్త మీటర్ బిగించారు. కానీ ఈ వ్యవహారం ఇంటి యజమానికి తెలియదు. పఠాన్ తో వచ్చిన వ్యక్తి ఇంటి పైకి వెళ్లి తిరిగి వచ్చారు. చప్పుడు రావటంతో ఇంటి యజమాని వెంకటరమణ  బయటకు వచ్చి చూడగా ఇద్దరు వ్యక్తులు కరెంటు మీటరు మార్చడం చూసి నివ్వేర పోయారు. ఇదేమిటి ఎవరి అనుమతి లేకుండా మీటర్ మార్చడం ఏమిటి అని నిలదీశారు మీరు ఎవరు మీ వద్ద ఏం గుర్తింపు కార్డు ఉంది మా అనుమతి లేకుండా ఎలా మారుస్తారని నిలదీశారు దీనికి సదరు లైన్మెన్ పటం దురుసుగా సమాధానం చెప్పడం విశేషం యజమాని తిరిగి ప్రశ్నించగా అంతా నా ఇష్టం నీ దిక్కున చోట చెప్పుకో అంటూ బూతు పురాణం ఎత్తుకున్నారు చివరకు ఘర్షణకు దిగేందుకు సిద్ధం అయ్యారు. నాతో పెట్టుకుంటే నీ ఇంటికి కరెంటు ఉండదు వైర్లు కట్ చేస్తే కరెంట్ కోసం నా చుట్టూ తిరగాలి... ఐ..డి.. కకే లా... ఏంరా అంటూ బూతులు తిట్టడం విశేషం ఉద్యోగి అయింది. ఇలా ప్రవర్తించడం ఏమిటి అని బాధితులే నివారిపోయారు. ఇంటి యజమాని బెదిరించడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో నివారిపోయారు. అనుమతి లేకుండా ఇంట్లోకి రావడమే కాకుండా దురుసుగా ప్రవర్తించి బూతులు తిట్టడంతో వెంకటరమణ నిజామాబాద్ మూడో టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే ఏసిపి నిజామాబాద్కు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ విద్యుత్ శాఖ డీఈఈ కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. లైన్ మెన్ మటన్ పై ఫిర్యాదు చేసి రెండు మూడు రోజులు గడుస్తున్న ఇటు పోలీసులు అటూ శాఖ ఉద్యోగులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితుడు ఏసిపి రాజారెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు.

అంతా రికార్డు

   విద్య శాఖ ఉద్యోగులు పటం వ్యవహరించిన తీరు మొత్తం వాయిస్ రికార్డ్ సిసి కెమెరాలో రికార్డు అయింది ఇది గమనించిన పటాన్ ఇంటివద్ద ఇస్తా రాజ్యాంగ వ్యవహరించ వినియోగదారుడు పై దురుసుగా ప్రవర్తించడం విశేషం. వాస్తవానికి మీటర్ మార్చాలన్న ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తే వినియోగదారుడు ఫిర్యాదు నమోదు అయి ఉండాలి. అలాంటివి ఏమీ లేకుండా సరే సరే ఇంటికి వచ్చి మీటర్ తీసి మీటర్ పెట్టడంతో ఆందోళన చెందిన బాధితులు ఎదురు తిరిగారు దీంతో ఆగ్రాని గురైన పటం దురుసుగా మాట్లాడడం గమనార్హం చివరకు ఇటు పోలీసులు అటు విద్యుత్ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..