భగత్ సింగ్ జయంతి అధికారికంగా నిర్వహించాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:34
Bhagat Singh Jayanti should be officially celebrated
  • ఎస్ ఎఫ్ ఐ మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్ డిమాండ్
  •      జిల్లా పట్టణ కేంద్రం లో ఘనంగా జయంతి 

 మహబూబాబాద్ బ్యూరో సెప్టెంబర్ 28 (ప్రజాజ్యోతి) .//..అఖిలభారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ దగ్గర భగత్ సింగ్ విగ్రహం వద్ద భగత్ సింగ్ 115 జయంతి పురస్కరించుకొని భగత్ సింగ్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సూర్య ప్రకాష్ మాట్లాడుతూ భగత్‌సింగ్‌ జీవితం 24  ఏండ్లే కానీ, ఆ స్వల్ప జీవిత కాలంలోనే 7 ఏండ్ల తన రాజకీయ జీవితంలో నిర్దిష్టమైన లౌకిక, ప్రజాస్వామిక భావాలను వ్యాప్తిచేసి, ఆచరించిన మార్గదర్శకుడు అని  డివిజన్ కార్యదర్శి సూర్యప్రకాష్ అన్నారు రాజకీయాల్లో మతానికి స్థానం ఉండరాదని, అది వ్యక్తుల అభిమతంగానే ఉండాలని నాడే బోధించారాయన. వర్గ చైతన్యమే మతతత్వాన్ని నిర్మూలిస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి భగత్‌సింగ్‌ అన్నారు.మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవ వీరుడు సర్దార్‌ భగత్‌సింగ్‌. ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి, స్వరాజ్య సాధన పోరాటంలో చిరుప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు. ఆయన పేరు వింటే చాలు యావత్‌ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువకుల్లో స్ఫూర్తినింపింది. గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన వీరుడు భగత్‌సింగ్‌. ఉరికొయ్య ముందు నిల్చొని ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అనే నినాదం ఇచ్చారు. ఆ ధైర్యమే విప్లవ ప్రవాహంలా మారి తర్వాతి తరాలకుమార్గదర్శకమైంది.మతాల మధ్య సామరస్యతకు, దేశ ప్రజల నడుమ శాంతియుత సహజీవనానికి ప్రతీకగా నిలిచారు భగత్‌సింగ్‌. అందరికీ ఆమోదయోగ్యమైన విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. 1919లో జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన మూకుమ్మడి హత్యల తర్వాత బ్రిటిష్‌ వారు అవలంబించిన ‘విభజించి పాలించు’ పద్ధతికి మరింత పదునుపెట్టారుమతం వ్యక్తిగతమైన విషయం దానిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని భగత్‌సింగ్‌ అన్నారు.

మతతత్వాన్ని నిర్మూలించడానికి ఏకైక మార్గం వర్గ చైతన్యం అని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం గురించి భగత్‌సింగ్‌ చాలా రచనలు చేశారు. ‘ప్రజలందరూ సమానులేనని, వర్గాల విభజన, అంటరానితనం అనే విభజన ఉండకూడదనీ, మతానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటామని ప్రతిజ్ఞ చెయ్యాలి, లేదా దాన్ని కచ్చితంగా వ్యతిరేకించాలి’ అని పిలుపునిచ్చారు. ఆయన ‘నేను నాస్తికుడిని ఎందుకయ్యానంటే..’ అనే వ్యాసం రాసినప్పుడు, హేతుబద్ధ వైఖరి, పాదార్థిక అవగాహన, మార్క్సిస్ట్‌ ప్రాపంచిక దృక్పథం తనను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. సంకుచిత స్వపక్ష దురభిమానులను భగత్‌సింగ్‌ ప్రజల శత్రువుగా చూశారు. అందుకే నేడు దేశంలో ‘భగత్‌సింగ్‌ తమ్ములం భరతమాత బిడ్డలం’ అని పైకి నినాదాలిచ్చే ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘీయులు, కర్ణాటకలో 10వ తరగతి పిల్లలకు ఉన్న భగత్‌సింగ్‌ పాఠాన్ని తొలగించి దానికిబదులు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు హెగ్డేవర్‌ పాఠాన్ని చేర్చారు. భగత్‌సింగ్‌ బలంగా నమ్మి ప్రచారం చేసిన లౌకిక, ప్రజాస్వామ్య భావాలపట్ల వారిలో దాచిపెట్టుకున్న వ్యతిరేకతకు ఇది ప్రత్యక్ష నిదర్శనం

.
దేశ ప్రజలకు సంపూర్ణ స్వాతంత్రాన్నిచ్చే మేలైన భారతదేశాన్ని సృష్టించేందుకు భగత్‌సింగ్‌ చేసిన కృషిని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనపై ఉన్నది. ప్రజాస్వామిక వ్యవస్థ స్థాపన కోసం సమిధలైపోయిన ఎందరో వీరుల త్యాగఫలాన్ని నేడు ప్రతి భారత పౌరుడూ ఆస్వాదిస్తున్నాడంటే ఆ ఘనత భగత్‌సింగ్‌ వంటి వీరులు, ధీరులకే దక్కుతుంది. అందుకే నేడు దేశంలో వేళ్లూనుకుపోయిన కుల, మత మౌఢ్యాలు పోవాలంటే లౌకిక, ప్రజాస్వామికశక్తులు భగత్‌సింగ్‌ స్ఫూర్తితో దేశ ప్రజలను చైతన్యపరచాలి.నేను నాస్తికుడిని ఎందుకయ్యానంటే. అనే వ్యాసం రాసినప్పుడు, హేతుబద్ధ వైఖరి, పాదార్థిక అవగాహన, మార్క్సిస్ట్‌ ప్రాపంచిక దృక్పథం తనను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. సంకుచిత స్వపక్ష దురభిమానులను భగత్‌సింగ్‌ ప్రజల శత్రువుగా చూశారు. అందుకే నేడు దేశంలో ‘భగత్‌సింగ్‌ తమ్ములం భరతమాత బిడ్డలం’ అని పైకి నినాదాలిచ్చే ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘీయులు, కర్ణాటకలో 10వ తరగతి పిల్లలకు ఉన్న భగత్‌సింగ్‌ పాఠాన్ని తొలగించి దానికిబదులు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు హెగ్డేవర్‌ పాఠాన్ని చేర్చడం దారుణం అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ సహాయ కార్యదర్శి బానోతు సింహాద్రి,పట్టణ నాయకులు భూక్యా రాజేష్, కడరి ప్రవీణ్,ఉపేందర్,చంటి,సందీప్, రంజిత్,జశ్వంత్, వినయ్,తరుణ్, తదితర నాయకులు పాల్గొన్నారు