మునుగోడు ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన బడుగుల

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 10:16
The barangays who previously distributed Bathukamma sarees to women

కొండా లక్ష్మణ్ బాపూజీ కి నివాళులర్పించిన పలువురు నేతలు

మునుగోడు సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి): మునుగోడు :భారత దేశములో బీజేపీ కేంద్ర ప్రభుత్వం దమ్ముంటే ,తెలంగాణ రాష్ట్రంలో  కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ సవాల్ చేశారు.మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ పండుగ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మొదటగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు.నియోజకవర్గంలో ప్రజలంతా ఉత్సాహంగా వున్నారని తెరాసా అభ్యర్ధి బారి మెజారిటీతో విజయం సాధించడం కాయమన్నారు.రాష్ట్రములో 200 రూపాయిలు వున్న పింఛన్లు 2000 రూపాయలు చేయడం జరిగిందని,ప్రతి గ్రామాల్లో మౌలికవసతుల కల్పించడం జరిగిందన్నారు.మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మూడున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా వుండి ప్రజల్లోకి రాలేదని,సమస్యలు పరిష్కరించలేదని,ఓట్లు అడిగే అర్హత కూడా కోల్పోయారు.మా గెలుపు నల్లేరుమిద నడకనే అన్నారు.ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ మిరియాల వెంకటేశ్వర్లు,ఎంపీపీ. కర్ణాటక స్వామి, మండల ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి మురళి మోహన్, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు నాగరాజుగౌడ్, ఎంపిటిసి లు శ్రావణి, నిర్మల శరత్, మరియు వార్డు మెంబర్లు పాల్గొన్నారు