రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం కొరకు మంత్రి ఎర్రబెల్లి కి వినతి పత్రం

Submitted by lenin guduru on Wed, 07/12/2022 - 19:38
Minister

రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం కొరకు మంత్రి ఎర్రబెల్లి కి వినతి పత్రం

పాలకుర్తి, డిసెంబర్ 07,(ప్రజాజ్యోతి):-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జాబ్ చార్ట్ ప్రకారం ప్రీ ప్రైమరీ టీచర్ లుగా పనిచేస్తూ, ఆరోగ్య లక్ష్మీ,  సంక్షేమ పథకాల అమలుకు ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్న అంగన్ వాడి టీచర్లు,ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్,ఫెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ అంగన్ వాడి టీచర్స్ ,హెల్పర్స్ యూనియన్ నాయకులు, సభ్యులు బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం అంగన్ వాడి టీచర్లు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.1975 లో ఐసిడీఎస్ స్కీం గా ప్రారంభమై నేటికీ ఉద్యోగాలు చేస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ విధానం లేక  అనారోగ్య సమస్యలతో అనేక మంది టీచర్లు,ఆయాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాతనే  కేసీఆర్ అంగన్ వాడి టీచర్లకు, ఆయాలకు జీతాలు పెంచారని గుర్తు చేశారు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 5 లక్షల రూపాయలుగా, ఆయాలకు 3 లక్షల రూపాయలగా, పెన్షన్ సౌకర్యం టీచర్లకు 5 వేలు,ఆయాలకు 3 వేలు గా ఇవ్వాలని  కారుణ్య నియామకాలు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ అంగన్ వాడి యూనియన్ సభ్యులు, టీచర్లు ముస్కు అరుణ, పి. సువర్ణ, పి. భిక్షం, జి. రమాతార, జి. భాగ్యలక్ష్మి, ఎ. గీతారాణి, ఎన్. నిర్మల, రజిత తదితరులు ఉన్నారు.