అన్నింటిలోకెల్లా ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది.

Submitted by sridhar on Tue, 06/09/2022 - 10:17
All in all, teaching is a great profession
  • ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.
  • ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి.

అచ్చంపేట సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి.; సమాజంలో అన్నిటికంటే ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని తల్లి తండ్రి గురువు దైవం మూడింటిలో కంటే కూడా గురువు చాలా గొప్పవాడని ప్రభుత్వ విపు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు సోమవారం అచ్చంపేట పట్టణంలోని అంగిరేకుల ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సన్మాన కార్యక్రమం నియోజకవర్గస్థాయిలో 100 మంది ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సన్మానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి దిశా దశ మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు అదేవిధంగా గురువు అన్ని విధాలుగా సమాజంలో గురించి తెలియనటువంటి విషయాలను విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి గొప్ప వ్యక్తి ఉపాధ్యాయ ఆయన అన్నారు విద్యార్థి దశ నుంచి ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించే విధంగా ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని తయారు చేస్తాడని అలాంటి ఉపాధ్యాయుల గురువు పూజోత్సవం సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు అంతకుముందు అచ్చంపేట పట్టణంలోని ఎస్ టి యు ఉపాధ్యాయ సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు దీంతోపాటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పైన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన అన్నారు.

ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్నాని ఇందులో భాగంగా తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు అచ్చంపేట నియోజకవర్గం విద్యా వైద్యం ఇతర రంగాలలో కూడా అభివృద్ధిపరిచే విధంగా చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు అచ్చంపేట నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సందర్భంగా పేర్కొన్నారు ప్రభుత్వం విద్యా వైద్యరంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు.

నియోజకవర్గ స్థాయిలో 100 మంది ఉపాధ్యాయులను సన్మానించి వారికి జ్ఞాపికలను  అందజేయడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్ అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ జడ్పిటిసి మంత్రియా నాయక్ ఎంఈఓ రామారావు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పులిజాల రమేష్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు బీచ్చా నాయక్  శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి సుదర్శన్.వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.