ఆయిల్ ఫామ్ సాగును చేపట్టేందుకు రైతులు ముందుకు రావాలి

Submitted by lenin guduru on Sat, 22/10/2022 - 17:30
Photo

ఆయిల్ ఫామ్ సాగును చేపట్టేందుకు రైతులు ముందుకు రావాలి

ఉద్యాన,వ్యవసాయ శాఖ అధికారులు కేఆర్ లత, వినోద్ కుమార్

జనగామ, అక్టోబర్ 22, ( ప్రజాజ్యోతి):-
జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు అవకాశాలు మెండుగా ఉన్నందున పంటను చేపట్టేందుకు రైతులు ముందుకు రావాలని జిల్లా ఉద్యాన వ్యవసాయ శాఖ అధికారులు కేఆర్ లత వినోద్ కుమార్ లు కోరారు.
శనివారం కలెక్టర్ కార్యాలయంలోని ఉద్యాన శాఖ కార్యాలయంలో ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఆయిల్ ఫామ్ సాగు పంట విశిష్టతపై పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ముందుగా ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో జల వనరులు సమృద్ధిగా ఉన్నాయని తమ శాఖ ద్వారా 18 వేల ఎకరాల లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. జిల్లాలో గత సంవత్సరం నుండి ఆయిల్ ఫామ్ సాగును చేపట్టడం జరుగుతున్నదని ఆయిల్ ఫామ్ ను జిల్లాలో మరింత విస్తరింప చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 6  వేల ఎకరాల్లో సాగు చేసేందుకు 11 నెలల వయసు గల నాలుగు లక్షల మొక్కలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఆయిల్ ఫామ్ తోటల సాగు చేపట్టిన నాటి నుండి మొక్కలు కాపు దశ వచ్చేవరకు 3 సంవత్సరంలు అంతర్ పంటల ద్వారా లబ్ధి పొందుతూ ఆయిల్ ఫామ్ తోటలను పెంచవచ్చునన్నారు. నాలుగవ సంవత్సరం నుండి ఆయిల్ ఫామ్ తోటలు కాపుదశకు వస్తాయని ఐదు నుండి ఆరు టన్నులు దిగుమతి వస్తుందని ఐదవ సంవత్సరము నుండి 10 నుండి 16 టన్నుల దిగుబడి వస్తుందని తద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతమవుతారన్నారు. మొక్క ఎదుగుదల లో 150 నుండి 200 లీటర్లు నీరు అవసరం అవుతుందని మొక్క ఎదిగిన తర్వాత సుమారు 300 లీటర్ల వరకు నీరు అవసరం ఉంటుందన్నారు ఎకరానికి లక్ష నుండి లక్షన్నర వరకు ఆదాయం గడించవచ్చునని ఏడు సంవత్సరముల తర్వాత సంవత్సరానికి మూడు లక్షల వరకు ఆదాయం పొందవచ్చు అన్నారు ఇతర నూనె పంటల కన్నా పామాయిల్ పంటలో చీడపీడలు తక్కువగా ఉంటాయని దిగుబడి అధికంగా ఉంటుందన్నారు. దొంగల బెడద కోతుల బెడద ఉండదని తెలియజేశారు కాలుష్యం కూడా ఉండదన్నారు మొక్క కొమ్మలు ఆకులు విత్తనాలు ఎరువుగా ఉపయోగించుకోవచ్చును అన్నారు.
గత సంవత్సరం 426 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు చేయగా 12.9 లక్షల ఆదాయం పొందడం జరిగిందన్నారు. ప్రస్తుత సంవత్సరానికి 6 వేల 46 ఎకరాలను లక్ష్యంగా ఎంచుకొని 1178 రైతుల కు సంబంధించి ఆరువేల పది ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టడం జరిగిందన్నారు త్రికోణ ఆకారంలో ఎకరానికి 57 మొక్కలు వేసుకోవచ్చని చతురస్రకారంలో 50 మొక్కలు కు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు కుక్కలు వేసే ఎందుకో ముందుగా గుంతలు తీసి పెట్టుకోవాలని తద్వారా వైరస్ తొలగిపోతుందన్నారు డ్రిప్పు ద్వారా మొక్కకు ఒకే తరహాలో నేరుగా నీటి సరఫరా అందించేందుకు అవకాశం ఉన్నందున సన్న చిన్న కారు రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎస్సీ ఎస్టీ రైతులకు డ్రిప్పులో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు.
జిల్లాలో మలబరి తోటలు పెంచేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నందున రైతులు ఆసక్తి చూపాలన్నారు ఎకరాకు 25 వేలు షెడ్డు నిర్మాణానికి రెండు లక్షలు అందజేస్తున్నందున రైతుల ఆలోచన చేయాలన్నారు రైతులందరూ వరి పంట పైనే ఆధారపడి ఉన్నారని తద్వారా నష్టపోతున్నారని ఇకనైనా రైతులు గ్రహించి అధిక ఆదాయంతో పాటు స్థిరాదాయాన్నిచ్చే ఆయిల్ ఫాం సాగు పై దృష్టి పెట్టాలన్నారు
వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉద్యాన శాఖకు చేయూతగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా పనిచేస్తారని తెలియజేశారు ఉద్యాన శాఖ వ్యవసాయ శాఖలు ఇకనుండి సంయుక్తంగా రైతులకు సేవలందిస్తాయని అన్నారు రైతులు ఒకే పంట వేసే మూస విధానాన్ని విడనాడాలని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను చేపట్టి ఆర్థిక అభివృద్ధి చెందాలని కోరారు.