భయాందోళనల గుప్పెట్లో ఏజెన్సీ ప్రాంతం.

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:26
 Agency area in the throes of panic.

విచ్చలవిడగా కొనసాగుతున్న క్షుద్ర పూజలు.

కొత్తగూడ  సెప్టెంబర్28 (ప్రజా జ్యోతి),.// మండలం కిష్టాపురం అడ్డరోడ్డు వద్ద మంగళవారం రాత్రి క్షుద్ర పూజలు నిర్వహించిన ఆనవాళ్ళు బుధవారం ఉదయం కనిపించడంతో ఈ ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారు.  కొత్తగూడ ఇల్లేందు ప్రధాన రహదారి  నుంచి కిష్టాపురం గ్రామానికి వెళ్లే రహదారి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం  రాత్రి పూజలు జరిపారనడానికి నిదర్శనంగా ఆ ప్రదేశంలో పెద్ద మొత్తంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయాలు, ఒక ప్లాస్టిక్ కవరులో కోడి,  కొబ్బరి కాయలు ఉండడంతో పాటు  పూజలు నిర్వహించారనడానికి ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో  కిష్టాపురం గ్రామస్తులతో పాటు  ఆ రహదారి వెంట గంగారం మండలానికి వెళ్ళేవారితో పాటు  ఇల్లేందు వైపు వెళ్లే ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మండలంలో కొందరు వ్యక్తులు ఆక్రమార్జనే ద్యేయంగా అమాయకుల నమ్మకాలను  ఆసరా చేసుకుని వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.  మూఢనమ్మకాలు నమ్మకూడదంటూ ప్రభుత్వం  వివిద రూపాల్లో ఎన్ని ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ    ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు ఆక్రమార్కులు తమ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతు     చేసే ఈ రకమైన చేష్టలతో ఏజెన్సీ ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఈ అక్రమార్కుల ఆగడాలకు కళ్లెం వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు, కాగా ఇటువంటి పూజలు మండలంలో పలు ప్రాంతాల్లో  జరుగుతున్నట్లు తెలుస్తుంది మండలంలోని ఎంచగూడెం, ఓటాయి, రాంపురం,కుందన పల్లి, కొత్త పల్లి, తదితర గ్రామాల క్రాస్ రోడ్ల వద్ద ప్రతి రెండు మూడు రోజులకోసారి ఇటు  వంటి పూజలు జరిపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఆయాగ్రామాల ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు  వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.