ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:53
Acharya Konda Laxman Bapuji's death anniversary celebrations.

అచ్చంపేట సెప్టెంబర్ 21 ప్రజా జ్యోతి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమ నిర్మాత పద్మశాలి పితామహుడు కీర్తిశేషులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పదవ వర్ధంతి సందర్భంగా బుధవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కోట కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా గుప్తా స్కూలు అనాధ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోట కిషోర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సాధన తొలి దశలో ఆయన కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు 1969 లో లక్ష్మణ్ తన మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా రాజీనామా చేసి సిద్ధాంతానికి కట్టుబడి పని చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు సైదులు రమేష్ సంతోష్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
ఫోటో రైట్ అప్.వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్న నాయకులు.