యాపదిన్నె బ్రిడ్జీని వెంటనే నిర్మించాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:21
Yapadinne Bridge should be constructed immediately

ప్రజల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం
బీఎస్పీ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు ఎంసీ కేశవరావు

అలంపూర్,(ప్రజా జ్యోతి) సెప్టెంబర్28:  అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండల కేంద్రంలో యాపదిన్నె-వావిలాల ప్రధాన రహదారి పై వంతెన కొద్ది కాలం క్రితం కొద్దిపాటి వర్షానికి కూలిపోయింది. దాంతో ప్రజలు యాపదిన్నె నుంచి వావిలాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలు, వృద్ధులు, ద్విచక్ర వాహనాలు, బస్సులు వెళ్లడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ ఉన్న పల్లెలకు వెళ్లడానికి చాలా దూరం తిరిగి వెళ్లాల్సి వస్తుందాని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మహిళలు  కాలినడకన వెళ్తూ ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రజాప్రతినిధులు, ధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇంతవరకు స్పందించలేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విషయం తెలుసుకున్న బీఎస్పీ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎంసీ కేశవరావు బుధవారం వంతెనను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వంతెన కూలిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా  ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చినా కూడా కనీసం పట్టి పట్టనట్టు  ఉంటున్నారంటే  వీళ్లకు ప్రజలమీద ఏ మాత్రం మమకారం లేదని అర్థం అవుతుందాని అన్నారు. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా మేలుకొని ప్రజాప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తక్షణమే వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, నిర్మాణం చేపట్టకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని ఆయన హెచ్చరించారు.  సర్పంచ్ కి కూడా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సహకరించట్లేదని అన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు ఈ గ్రామస్తులు అందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, తక్షణమే మేల్కొని ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పనులు చేపట్టాలని బిఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎంసీ కేశవరవు, ఆకేపొగు రాంబాబు, అలంపూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రవిచందర్, ఐజ మండల సీనియర్ నాయకులు శ్యామ్ దాస్, జిల్లేడు దీన్నే మహేందర్, యాపదిన్నె సర్పంచ్ ఇన్సెంట్, పెదరాముడు, తిక్కన్న, యాపదిన్నె, వావిలాల , సాతర్ల గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.