సిపిఐ జాతీయ మహాసభను జయప్రదం చేయండి:సిపిఐ పిలుపు

Submitted by Paramesh on Thu, 29/09/2022 - 13:59
Win the CPI National Congress: CPI's call

నేరేడుచర్ల, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి):  అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు.గురువారం నేరేడుచర్లసిపిఐ కార్యాలయం ప్రజా భవన్ లో పార్టీ 24 జాతీయ మహాసభల వాల్ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూభారత రాజకీయ చిత్రపటంలో అత్యంత పోరాట చరిత్ర కలిగిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని, అధికారంతో సంబంధం లేకుండా ఓట్లు సీట్లతో పట్టింపు లేకుండా నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాక్షేత్రంలో నిలబడి మడమ తిప్పని పోరాటం చేయ గల చరిత్ర కమ్యూనిస్టు పార్టీది ఆయన అన్నారు.ప్రజా హితమేతంగా తమహితంగా ప్రజా శ్రేయస్సే తమ శ్రేయస్సుగా భావించి విలువైన తమ జీవితాలను పార్టీ కోసం ఫణంగా పెట్టే అపూర్వ త్యాగధనులు కమ్యూనిస్టులని, కమ్యూనిస్టులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది కమ్యూనిస్టులేనని నాడు తెలంగాణ, ను ప్రత్యేక దేశంగా ఉంచాలని నిజం నవాబు భావిస్తే తెలంగాణ ప్రజానీకాన్ని సమీకరించి బాంచెన్ నీ కాల్ మొక్కుతా అన్న ప్రజానీకాన్ని బాంచత్ రారా నా కొడకా అంటూ సవాల్ చేసే స్థాయికి తీసుకొచ్చి నైజామోడీ పైజామా ఊడెంతవరకు  పరుగులు తీయించి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసిన ఘన చరిత్ర సిపిఐ పార్టీది అని ఆయన అన్నారు.అన్నార్తుల ఆక్రందనలు అరణ్య రోదనలుగా మిగిల్చి వేస్తున్న మతోన్మాద ప్రభుత్వ విధానాలను చైతన్యవంతమైన యువత గ్రహించాలని తిరోగమన విధానాలు అవలంబిస్తున్నబిజెపి పార్టీని రానున్న రోజుల్లో గద్దె దింపేందుకు విజయవాడలో జరుగుతున్న సిపిఐ జాతీయ మహాసభలు వేదిక కాను న్నాయని, దేశంలోని లౌకిక శక్తులు  ఐక్యమై నీ,నా, తన,మన,స్వార్ధం లేని నూతన సమాజం నిర్మించేందుకు, దేశ సంపద అంతా బహుళ జాతి కంపెనీలకు కట్టుపెడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై విప్లవ శంఖం పూరించాలి అని ఆయన అన్నారు.   


 అక్టోబర్ 14వ తేదీన లక్షలాది మందితో విజయవాడ నగరంలో మహా ప్రదర్శన ఉంటుందని 15 నుంచి 18 వరకు ప్రతి నిధుల  మహాసభ జరగనున్నదని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేరళ ముఖ్యమంత్రి విజయన్ తో సహా ప్రపంచంలోని 32దేశాల సౌహార్ధ ప్రతినిధులు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి యల్ల బోయిన సింహాద్రి, పట్టణ సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను, ఏఐటీయూసీ మండలాధ్యక్షుడు ఊదర వెంకన్న, ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు రేఖ ఉపేందర్  తదితరులు పాల్గొన్నారు