సహకార సంఘము ద్వారా అర్హులైన రైతులకు ఋణములు అందిస్తాం......సహకార బ్యాంక్ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి

Submitted by Paramesh on Sat, 24/09/2022 - 11:15
We will provide loans to eligible farmers through cooperative society... Director of Cooperative Bank Dondapati Appireddy

నేరేడు చర్ల, సెప్టెంబర్ 23, (ప్రజా జ్యోతి):  నేరేడు చర్ల పట్టణ పరిధిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నేరేడుచర్ల, నందు శుక్రవారము మహాజన సభ సమావేశము సంఘ అధ్యక్ష్లులు మరియు నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగినది. ఈ సందర్బముగా అధ్యక్షుల అప్పిరెడ్డి మాట్లాడుతూ సంఘము ద్వారా అర్హులైన రైతులకు సల్పకాలిక ఋణములు మరియు దీర్ఘ కాళిక ఋణములు, సంఘము ద్వారా రైతులకు అందుబాటులో వుండే విధముగా పురుగు మందుల వ్యాపారము ప్రారంబించినాము అని అన్నారు. రైతులు సహకరించ గలరు అని కోరినారు, మరియు సంఘముద్వారా నేరేడుచర్ల పాలకీడు గరిడేపల్లి ప్రజలకు నిత్యవసర ధరలు అందుబాటులో వుండడం కోసం సంఘము ద్వారా సూపర్ మార్కెట్ సేవలు అందుబాటులో వుంచుట కొరకు పాలక వర్ఘము కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘ ఉపాద్యాక్ష్హ్యులు కొప్పుల రాంరెడ్డి, సంఘ పాలకవర్గ సభ్యులు తాళ్ల రామకృష్ణారెడి, పోరెడ్డి పద్మ, దేవులపల్లి శంకరాచారి, తాళ్ల సురేశ్ రెడ్డి, కట్టా సత్యనారాయణ రెడ్డి, నూకల వెంకట రెడ్డి, చందమల్ల వెంకన్, వేముల జయమ్మ, కుసుమ శేఖర్ రెడ్డి, సపావత్ భీక్య మరియు సంఘ మాజీ ఛైర్మన్ పోరెడ్డి బుచ్చి రెడ్డి, మరియు సంఘ పరిధిలోని రైతులు సంఘ  సీఈఓ శ్రీనివాస్,  సిబ్బంది పాల్ఘోన్నారు.