రైతులకు ప్రస్తుత ఖరీఫ్ లో కోటి రూపాయల పంట రుణాలు అందించాం..

Submitted by kosgi narsimulu on Mon, 26/09/2022 - 13:52
 We have provided crop loans worth crores of rupees to the farmers in the current kharif.

 రెండు కోట్లతో కోల్డ్ స్టోరేజ్ గోదాం..
- ఈ ఆర్థిక సంవత్సరంలో కోటి రెండు లక్షల ఆదాయంతో ఎల్మకన్న కోఆపరేటివ్ సొసైటీ..
పిఎసిఎస్ చైర్మన్ రవి రవీందర్ గౌడ్  వెల్లడి

తాండూరు సెప్టెంబర్ 26 ప్రజా జ్యోతి:-   రైతులకు  ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో  కోటి రూపాయల పంట రుణాలు  అందించామని  తాండూరు మండలం ఎల్మకన్న కోఆపరేటివ్ సొసైటీ (పిఎసిఎస్) చైర్మన్  రవీందర్ గౌడ్  వెల్లడించారు. సోమవారం నాడు సొసైటీ సీఈవో శ్రీనివాస్ ఆద్వర్యంలో  ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లా సహకార సంఘం చైర్మన్ మనోహర్ రెడ్డి  సహకారంతో  తాండూరు  ఎల్మకన్న కో ఆపరేటివ్ సొసైటీ అభివృద్ధి కోసం నాబార్డ్ ద్వారా  రెండు కోట్ల రుణాలు అందించడంతోపాటు  మరో రెండు కోట్లతో కోల్డ్ స్టోరేజ్ గోదాం నిర్మాణం కోసం  నిధులు మంజూరు చేశారన్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో కోటి రెండు లక్షల ఆదాయంతో ఎల్మకన్న కోఆపరేటివ్ సొసైటీ లాభంలో ఉండడంతో అధికారులను డైరెక్టర్లనుపిఎసిఎస్ చైర్మన్ రవి రవీందర్ గౌడ్  అభినందించారు. తీర్చిదిద్దగలమని చెప్పారు. పంట రుణాలు పొందిన పలువురు రైతులకు చెక్కులను అందజేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ ఎస్ నరసింహారెడ్డి డైరెక్టర్లు సురేందర్ రెడ్డి, అమృతయ్య గౌడ్, రాఘవేందర్, వెంకటరామిరెడ్డి, హనుమంత్ రెడ్డి, పార్వతమ్మ, అనంతమ్మ, పెండ నర్సిములు, సిద్దయ్య స్వామి వడ్ల బిచ్చన్న, ఫన్నీ భాయ్, సొసైటీ అధికారులు గంగాధర్, విశ్రాంత ఉద్యోగి చంద్రారెడ్డి, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.