వ్యర్థ పదార్థాలతో నిండిన మునుగోడు వాగు........

Submitted by Sathish Kammampati on Sat, 24/09/2022 - 11:56
వ్యర్థ పదార్థాలతో నిండిన మునుగోడు వాగు........


తప్పిదం ఎవరిది? అధికారుల నిర్లక్ష్యమా,  ప్రజాప్రతినిధులదా!!!

మునుగోడు సెప్టెంబర్ 23(ప్రజాజ్యోతి): మునుగోడు లో ఉన్న పెద్దవాగు పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది అత్యధిక జనాభా కలిగిన మేజర్ గ్రామ పంచయతీ పారిశుధ్యం నివారణ పేరుతో అన్నీ గ్రామ పంచాయితీలో తడి చెత్త మరియు పొడి చెత్త వేరుచేసి ట్రాక్టర్ లో నింపి డంప్యాడ్లో పోయవలసి ఉంటుంది ,కానీ దీనికి భిన్నంగా వాగులో చెత్తాచెదారం తో నిండిన మలినాలను పోస్తున్నారు.దీని వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటి ద్వారా వెలుబడే దుర్వాసనకు భరించలేక ఆరోగ్య సమస్యలతో మరియు శ్వాసకోస సంబంధిత వ్యాధుల బారిన పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.డంపింగ్ యార్డుకు సంబందించిన స్థలము మునుగోడుకు దగ్గరలో ఉన్న పాత లక్ష్మిదేవి గూడెంలో ఉన్నది . ఇప్పటి కైనా మునుగోడు గ్రామ పంచాయతీ అధికారులు చొరవ తీసుకుని పారిశుధ్య కార్మికులకు తెలిసేలాచేసి,డంపింగ్ యార్డు లో కుళ్ళి పోయిన వ్యర్ధాలను వర్మికంపోస్ట్ గా తయారు చేసి నిరుపేద వ్యవసాయ కుటుంబాలకు అందించే దిశగా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలివర్షము ద్వారా వచ్చే వరద నీటిని నిల్వ లేకుండా చూడడం మరియు వర్షపు నీటిని ప్రవహించడానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించ వలసిన బాధ్యత గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి లపై కలదు. ఇలాగే చూస్తే మునుగోడు లో వాగు అనేదే కనుమరుగై పోతుంది