ఊపిరి తీసిన ఉద్యోగం... ఆత్మహత్య చేసుకున్న ఇరిగేషన్ డీఈఈ...: ఆ ప్రజాప్రతినిధి వేధింపులే కారణం... రూ.5 లక్షలు పంపిన ప్రజాప్రతినిధి... తిప్పిపంపిన కుటుంబ సభ్యులు...

Submitted by SANJEEVAIAH on Thu, 19/01/2023 - 23:05
Dee

ఊపిరి తీసిన ఉద్యోగం

 ఆత్మహత్య చేసుకున్న వెంకటరమణారావు 

ప్రజాప్రతినిధి వేధింపులే కారణం

అంతిక్రియలకు రూ.5 లక్షల పంపిన వైనం 

తిప్పి పంపిన కుటుంబ సభ్యులు

స్పందించని ఉద్యోగ సంఘాల నేతలు

ఊపిరి తీసిన నీటిపారుదల శాఖ బిల్లులు

(నిజామాబాద్ ప్రతినిధి, ప్రజాజ్యోతి, ఎడ్ల సంజీవ్)

ఆయన పేరు వెంకటరమణారావు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నీటిపారుదల శాఖ డిఈఈ గా పనిచేస్తున్నారు. ఉన్నతమైన సిబిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.  ప్రైవేటు కంపెనీలలో ఉన్నతమైన ఎన్నో అవకాశాలు వచ్చిన వాటన్నిటినీ కాదని ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. నీటిపారుదల శాఖలో జర్నీ చేసి పదోన్నతి పై డిఈఈ గా పనిచేస్తున్నారు. కుటుంబ పరంగా గాని వ్యక్తిగతంగా, ఉద్యోగ పరంగా గాని ఎలాంటి సమస్యలు లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి హఠాత్తుగా నవీపేట్ మండలం యంచ సమీపంలోని గోదావరి నదిలో శవమైతెలాడు. ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి ఎలాంటి వివాదాలు లేకుండా వివాదరహితుడిగా ఉన్న ఆయన హఠాత్తుగా శవమైతెలడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రజాప్రతినిధి వేధింపులే  కారణం

వెంకట రమణారావు ఆత్మహత్యకు ఆర్మూర్ కు చెందిన ఓ ప్రజాప్రతినిధి వేధింపులే కారణమని తెలుస్తుంది. సదరు ప్రజాప్రతినిధి వెంకటరమణారావు అంత్యక్రియల కోసం ఓ వ్యక్తి ద్వారా ఐదు లక్షల రూపాయలు పంపించారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, స్థానికులు సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన అక్కడి నుంచి జారుకున్నట్లు సమాచారం. ఓ ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండి ఉద్యోగులకు మద్దతుగా నిలవాల్సింది పోయి వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు కారణమైనట్లు బహిరంగంగానే చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే సదరు ప్రజాప్రతినిధి పై ఇలాంటి వేధింపుల వ్యవహారాలు లేకపోలేదు. ఓ ఇద్దరు యువకుల హత్యకు కారణమని ప్రచారం ఉండగా మరోవైపు సర్పంచుపై విపరీతంగా వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ తనదైన శైలిలో వ్యవహరిస్తారని ఆరోపణలు ఉన్నాయి. నీటిపారుదల శాఖలోని చెయ్యని పనులకు బిల్లులు చెల్లించాలనే విషయం సదరు ప్రజాప్రతినిధికి మధ్య వివాదానికి ప్రధాన కారణం. అప్పటికే మరో ప్రజాప్రతినిధి పనులు పూర్తిచేసి బిల్లులపై సంతకాలు చేయించుకున్నారు. ఈ విషయాన్ని అడ్డం పెట్టుకున్న ప్రజాప్రతినిధి తన పనులకు ఎందుకు సంతకాలు పెట్టడం లేదని ఒత్తిడి చేశారు. పనులు పూర్తి కాలేదని సంతకాలు చేసే ప్రసక్తే లేదని సదరు అధికారి మొండికేయడమే అసలు సమస్యగా తయారైంది. దీంతో మొదలైన ఈ వివాదం వెంకటరమణ రావు పై వేధింపులకు కారణమైంది. ఈ వేధింపులను భరించలేక దీర్ఘకాలికంగా సెలవు పెట్టి వెళ్లిపోయారు. అలా వెళ్ళిన వ్యక్తి వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

వదలబమ్మాలి వదల...

వదల బొమ్మాలి వదల అన్నట్లుగా ఆర్మూరు నీటిపారుదల శాఖ డిఈఈ గా పనిచేస్తున్న వెంకటరమణారావుపై ప్రజాప్రతినిధి వ్యవహరించారు. ఆ ప్రజాప్రతినిధి వేధింపులను భరించలేక సెలవుపై వెళ్ళిపోయారు. అనంతరం కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయించుకున్నారు అయితే ఈ బదిలీ ఉత్తర్వులు వెలువడే ముందే వాటిని రద్దు చేయించి యధా స్థానంలో ఉంచారు. దీంతో అక్కడ పని చేయలేక ప్రజాప్రతినిధికి తలోగ్గాలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అప్పటికే ఆయన కుటుంబం మొత్తం పిల్లల చదువుల నిమిత్తమై హైదరాబాదులో స్థిరపడ్డారు కానీ చివరిసారిగా తన సొంత గ్రామమైన నవీపేట్ మండలం పోతంగల్ కు చేరారు. తల్లిదండ్రుల వద్దకు వచ్చిన వెంకటరమణారావు రెండురోజుల అనంతరం డ్యూటీ పని మీద బయటకు వెళుతున్నాను అని చెప్పి  వెళ్లారు. అలా వెళ్ళిన వ్యక్తి జనవరి 4న గోదావరి నదిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 5న మృత దేహం బయటపడింది. 6న అంతిక్రియాలు నిర్వహించారు.

చెప్పులు అరిగేలా తిరిగినా ..?

 నీటిపారుదరి శాఖలో డిఈఈ గా పనిచేసిన వెంకటరమణారావు తన బదిలీ కోసం ఎంతోమంది ప్రజా ప్రతినిధుల వద్దకు చెప్పులు అడిగేలా తిరిగినట్లు తెలుస్తుంది. ఎలాగైనా తనకు బదిలీ చేయించుకోవాలని పట్టుదలతో సుమారు 6 నెలల పాటు ప్రయత్నాలు చేసి విసిగిపోయారు. విచిత్రమైన విషయం ఏమిటంటే నీటిపారుదల శాఖలోని అధికారులు సైతం బదిలీ విషయంలో సదరు ప్రజాప్రతినిధి అనుమతి కావాలని చెప్పడం విశేషం. ఇలా వేధింపుల బారిన పడిన ఆయన ఇటు బదిలీ చేసుకోలేక అటు విధినిర్వహణలో పని చేయలేక అక్రమ మార్గాన సంతకాలు పెట్టలేక తనను తను ఆత్మ బలిదానం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఉన్నతమైన కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేసి ఎలాంటి ఆరోపణలు లేకుండా విధి నిర్వహణలో ఉన్న వెంకటరమణారావు ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖలో పాటు ఆయన సామాజిక వర్గంలోనూ చర్చనీయాంశంగా మారింది.

వెనక్కి తగ్గిన కుటుంబ సభ్యులు

 వెంకటరమణారావు ఆత్మహత్య విషయంలో కుటుంబ సభ్యులు ఎలాంటి విచారణకు వెళ్లేందుకు సిద్ధంగా లేరు అనేది తెలుస్తుంది. వాస్తవానికి కుటుంబం వివాదాలకు దూరంగా ఉంటుందని మంచి పేరుంది. అయితే ఈ ప్రజాప్రతినిధి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసినప్పటికీ వివాదం చేసుకునేందుకు ఇష్టం లేక వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఉన్నతమైన స్థానంలో ఉండి ఆత్మహత్య చేసుకున్న తమ వ్యక్తి లేనప్పుడు ఎవరితో ఎందుకు వివాదం పెట్టుకోవాలని ఆలోచనతోనే వెనక్కి తగ్గినట్లు కుటుంబ సభ్యులు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. 

స్పందించని ఉద్యోగ సంఘాలు

 నిజామాబాద్ జిల్లాలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వెంకటరమణారావు ఆత్మహత్యపై ఏ ఒక్క ఉద్యోగ సంఘం స్పందించలేదు. కనీసం సంఘీభావం కూడా ప్రకటించకపోవడం విచారకరం. ఒకవైపు నీటిపారుదల శాఖలో బలమైన సంఘము ఉన్నప్పటికీ సదరు ప్రజాప్రతినిధికి భయపడే నోరు విప్పడేదనేది విమర్శలు ఉన్నాయి. మరోవైపు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్ (టి జి ఓ), తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవోస్), తెలంగాణ ఉద్యోగుల సంఘం (టి ఈ ఏ) సంఘాల ప్రతినిధులు ఎవరు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెళ్లు వెతుకుతున్నాయి. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పందించి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఆత్మహత్యలకు పాల్పడిన వారిపై స్పందించాల్సిన అవసరం ఉందనే వాదనలు ఉన్నాయి. ఈరోజు నీటిపారుదల శాఖ డిఈఈ వెంకట రమణారావు ఆత్మహత్య ఘోష కుటుంబాన్ని ఇంకా విడలేదు. ఇలాంటి ప్రజాప్రతినిధిపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పందించాల్సిన అవసరం లేకపోలేదు.

రేపటి సంచికలో.... ఆత్మహత్యకు కారణం అప్పులా.? లేక  సొసైటీలోని అవినీతి అక్రమాలా.? పాల్దా సొసైటీ సీఈవో సునీల్ రెడ్డి ఆత్మహత్యపై "ప్రజాజ్యోతి" విశ్లేషణాత్మక కథనం..