కారును వెనుక నుండి ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం... యువకుడి మృతి

Submitted by Yellaia kondag… on Fri, 30/09/2022 - 10:41
 A two-wheeler hit a car from behind... a young man died

తుంగతుర్తి, సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి)./..ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ ముందు పోతున్న కారును వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందడంతో పాటు మరొక వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై డానియల్ తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి మండలం సిద్ధి సముద్రం తండాకు చెందిన ధరావత్ రాజ్ కుమార్( 18 ) తన బావ బానోతు సుమన్ తో కలిసి తుంగతుర్తి మండలం  ఏనేకుంట తండాకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వీరికి ముందు వేగనర్ (AP 28 DU 0912)కారు పోతుండగా అగస్మాత్తుగా కారుకు బ్రేకులు వేయడంతో వెనుక  రాజ్ కుమార్ ద్విచక్ర వాహనం  కారును బలంగా ఢీకొన్నాడు. దీంతో రాజ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు .సుమన్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించినట్టు పోలీసులు తెలిపారు .మృతుడి తండ్రి ధరావత్ బూర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డానియల్ కుమార్ తెలిపారు.