హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు గురుకుల డిప్యూటీ వార్డెన్ లకు శిక్షణ

Submitted by Sathish Kammampati on Thu, 29/09/2022 - 13:54
Training of Gurukula Deputy Wardens to Hostel Welfare Officers


నల్లగొండ,సెప్టెంబర్28(ప్రజాజ్యోతి)ప్రతినిధి: తెలంగాణ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నల్గొండలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు గురుకుల డిప్యూటీ వార్డెన్ లకు శిక్షణ కార్యక్రమం విజయవంతం చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సంక్షేమ హాస్టళ్ల,సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న వంట సిబ్బంది,వార్డెన్స్, స్టాఫ్ నర్స్ మరియు ప్రిన్సిపాల్ లను ఉద్దేశించి  ఈనెల 27 నుండి 30 వరకు నిర్వహింప తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా బుధవారం వార్డెన్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నల్గొండ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగింది కాలుషిత ఆహార నివారణ వ్యక్తిగత శుభ్రత  అనే అంశంపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ షేక్ షాహిన్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎస్పీ రాజ్ కుమార్,జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత ఎస్సీ సంక్షేమ అధికారి సల్మా భాను మాస్టర్ ట్రైనర్ ఎస్ వేణుగోపాల్ మైనార్టీ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ విజిలెన్స్ ఆఫీసర్ చంద్రారెడ్డి,ఉస్మాన్ ఆలీ గిరిజన గురుకుల పాఠశాల ప్రాంతీయ అధికారి లక్ష్మయ్య గారు జిల్లా వ్యాప్త అన్ని సొసైటీ సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు 230 మంది శిక్షణకు హాజరయ్యారు అని జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి గోశిక బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.