తాడిచెర్ల ఓసిపిలో విషాదం.

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 12:57
Tragedy in Tadicherla OCP.

 

  •   బొగ్గు టిప్పర్ డికొని కార్మికుడు మృతి
  • న్యాయం చేయాలని మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన

ప్రజాజ్యోతి.. మల్హర్.. సెప్టెంబర్  18 ప్రజాజ్యోతి.. మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసిపిలో విషాదం చోటుచేసుకుంది.బొగ్గు టిప్పర్ ఢీకొని ఆర్ని దశరథం (48) అనే కార్మికుడు మృతి చెందిన సంఘటన ఓసిపి బ్లాక్-1 ప్రధాన గెట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల పూర్తి కథనం ప్రకారం దశరథం ఏఎమ్మార్ ప్రయివేటు కంపెనీలో బ్లాస్టింగ్ హెల్పర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం పసిప్ట్ కావడంతో ఉదయం 5గంటలకు డ్యూటీలో చేరేందుకు వస్తున్న క్రమంలో ఓపెన్ కాస్ట్ లో బొగ్గులోడ్ కోసం వస్తున్న టీఎస్ 25, టి 3737 నెంబర్ గల టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే కార్మికుడు మృతి చెందాడు.విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు,గ్రామస్తులు సంఘటన స్థలానికి చేసురుకొని పెద్దయెత్తున ఆందోళన, నిరసన చేపట్టారు.కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో తమ బతుకు రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.తమ కుటుంబానికి ఏఎమ్మార్ కంపెనీ నష్టపరిహారం చెల్లించి,కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని బిస్మిoచి కూర్చున్నారు. డ్రైవర్ అజాగ్రత్త,అధికారులు సెక్యూరిటీ గార్డును నియమించకపోవడంతో నిండు ప్రాణాన్ని బలిగొన్నారని ఏఎమ్మార్ అధికారులపై దాడులు చేశారు..సంఘటన స్థలం వద్ద తీవ్రమైన ఉదృక్తత నెలకొనడంతో కాటారం డిఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాటారం సిఐ రంజిత్ రావు,మహాదేవ్ పూర్,కొయ్యుర్,కాళేశ్వరం ఎస్ఐలు భారీ బందోబస్తు నిర్వహించారు.మృతునికి భార్య,ఇద్దరు కూతుళ్లు,ఒక కుమారుడు ఉన్నారు.