మద్యం ఆదాయం పెంచుకోవడం పై తెరాస ప్రభుత్వం దృష్టి... బిజేపి నేతల ఫైర్

Submitted by Upender Bukka on Wed, 28/09/2022 - 09:46
Terasa government's focus on increasing liquor revenue... BJP leaders fire

ప్రజా జ్యోతి సూర్యాపేట జిల్లా ప్రతినిధి 27 సెప్టెంబర్.//.//.విద్య వైద్య రంగాలను గాలికి వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయం పై దృష్టి సారించిందని సూర్యాపేట జిల్లా బిజేపి నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పల్స మల్సూర్ గౌడ్ ఆధ్వర్యంలో సంకినేని నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. 2014 ఎన్నికలలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మూడు ఎకరాల భూమి హామీని నెరవేర్చలేదని అన్నారు. ప్రజలు అవకాశం ఇచ్చిన ఐదు సంవత్సరాలు పరిపాలించడం చేతకాక ముందస్తు ఎన్నికలకు పోయారని ఎద్దేవ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకు దళిత బందును ప్రకటించి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా గిరిజన బంధు అంటూ మరోసారి గిరిజనలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. దళిత బంధు డబ్బులను లబ్ధిదారులకు ఇవ్వాలంటే రెండు నుంచి మూడు లక్షలు టిఆర్ఎస్ నాయకులకు చెల్లించుకోవలసి వస్తుందని అన్నారు .మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని వాపోయారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి పచ్చని పల్లెలలో భూమి ,గేట్ల పంచాయతీ పెట్టారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిజెపి ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తున్నారని , రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి అబిద్, జిల్లా నాయకులు సలిగంటి వీరేంద్ర , కౌన్సిలర్లు మహాలక్ష్మి, సరిత ,వల్దాసు ఉపేందర్, గుడిసె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.