ప్రపంచములోనే పువ్వులను* పూజించే సంస్కృతి, సాంప్ర దాయం తెలంగాణది . బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

Submitted by Degala shankar on Mon, 26/09/2022 - 13:48
Telangana has a culture and tradition of worshiping flowers* in the world. Both MLA Rathore Bapurao

ఇచ్చోడ సెప్టెంబర్ 25, (ప్రజా జ్యోతి)///... ప్రపంచంలో నే పువ్వులను ఆరాదీస్తూ గౌరవిస్తూ పూజించే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ  సంబురాల్లో భాగంగా బతుకమ్మ చీరెలను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఆదివారం రోజున ఇచ్చోడ మండల కేంద్రములోని స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్నదమ్ములే ఆధరించని ఈ రోజుల్లో ఒక పెద్దన్నగా ప్రేమ, ఆప్యాయత లతో తన అక్కా, చెల్లెళ్లకు చిరు కానుకగా చీరెలను పంపడం కేసీఆర్ గారి గొప్పతనానికి  నిదర్శనమని అన్నారు. ఎన్నో అద్భుత పథకాలతో పాటు సంస్కృతి,సాంప్రదాయాలకు,అస్తిత్వ, ఆచారాలకు విలువ నిచ్చి ముందుకు సాగడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైందని అన్నారు. తీరొక్క పువ్వులతో పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలోనే ఉందని, ఇలాంటి గొప్ప సంస్కృతి ప్రపంచములో ఎక్కడ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సునీత చవాన్, టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి, మాజీ కన్వీనర్ మెరాజ్ హమ్మద్, సీనియర్ నాయకులు సుభాష్ పటేల్, రైతు బంధు అధ్యక్షులు ముస్తఫా, సుద్దవార్ వెంకటేష్, అబ్దుల్ రషీద్, ప్రకాష్, ఆర్గుల గణేష్, లతీఫ్, ముస్కు గంగారెడ్డి, అజిమ్ సుల్తాన్, రామేశ్వర్, సురేందర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, భూతి రాజు, మహేందర్ రెడ్డి, బలగం రవి, గొనె లక్ష్మీ, కడమంచి భీముడు, గంగయ్య, గాయకాంబ్లే గణేష్ తదితరులు పాల్గొన్నారు.