గద్వాల్

మల్దకల్ తిమ్మప్ప స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Submitted by bheemaraidu on Tue, 27/09/2022 - 12:49

 గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 26 :  హరిహరాదుల క్షేత్రం మల్దకల్ శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వయంభుగా వెలసిన లక్ష్మీదేవి అమ్మవారిని, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం మొదటి రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేసి, పూజలు నిర్వహించారు. అర్చకులు, వాల్మీకి పూజారుల ఆధ్వర్యంలో రోజుకొక అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు సదుపాయాలు కల్పించారు.

ప్రైవేటు ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

Submitted by bheemaraidu on Tue, 27/09/2022 - 12:47

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 26 : జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ సెంటర్ లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. చందు నాయక్ జిల్లా అధికారుల బృందంతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని కొన్ని లైసెన్స్ లేని ప్రైవేట్ హాస్పిటల్స్ కు సోకాజ్ నోటీసు జారీ చేశారు. మరియు ప్రైవేట్ ఆర్ఎంపీ క్లినిక్ నందు సెలైన్ బాటిల్లు, ఐవీ సెట్లు, ఇంజక్షన్లు ఉండటం గమనించి అట్టి క్లినిక్ ను సీజ్ చేశారు. మరియు ఫార్మసీ సెంటర్లు కూడా తనిఖీ చేశారు. ఆర్ఎంపీ డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని, ట్రీట్మెంట్ చేయరాదని తెలియజేశారు.

ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలి -- జిల్లా కలెక్టర్

Submitted by bheemaraidu on Tue, 27/09/2022 - 12:45

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 26:  సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష తో కలిసి, ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి తమ సమస్యలను తెలుపుతూ, ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను జిల్లా అధికారులు పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దరఖాస్తులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖ అధికారికి అందజేస్తూ, వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు

Submitted by bheemaraidu on Tue, 27/09/2022 - 12:44

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 26 :  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ వల్లూరి క్రాంతి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సెంట్రల్ మెడికల్ స్టోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Submitted by bheemaraidu on Sun, 25/09/2022 - 13:04

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 25 :  ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ సమీపంలో రాఘవేంద్ర హాస్పిటల్ ఎదురుగా సెంట్రల్ మెడికల్ స్టోర్ ను గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది.

బిజ్వారం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Submitted by Thirumal on Sun, 25/09/2022 - 12:55

గద్వాల్ :ప్రజాజ్యోతి ప్రతినిధి:-  తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన పండుగ బతుకమ్మ పండుగను బిజ్వారం జై భీమ్ కాలనిలో వున్న ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఆటపాటలతో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు, ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రమణమ్మ బతుకమ్మ పండుగ నుద్దేశించి మాట్లాడుతూ పూర్వం నవాబుల కాలంలో భూస్వామ్య పెత్తందార్లు మహిళల పట్ల అకృత్యాచేస్టాలకు భరించలేక ఆత్మహత్య చేసుకున్న మహిళలకు సాటి మహిళలు మనోధైర్యాన్ని కల్పిస్తుండేవారని అన్నారు, ఒక్కోసారి మహిళలు వేదింపులు భరించలేక బలి అయిన మహిళలను గుర్తుకు తెచ్చుకొని మహిళలంతా ఒక చోట గుమిగూడి అప్పట్లో ఆనాటి నుండి నేటి వరకు

ఘనంగా జాతీయ సేవా పథకం దినోత్సవం

Submitted by bheemaraidu on Sun, 25/09/2022 - 12:51

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 24 : మల్దకల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సేవా పథకం దినోత్సవం సెప్టెంబర్ 24ను జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాలలోని కంప చెట్లను, ముళ్లపొదలను తొలగించి శుభ్రం చేశారు.

ప్రతిభగల విద్యార్థులు నిరంతరం చదువుపైనే దృష్టి సారించాలి -- జిల్లా కలెక్టర్

Submitted by bheemaraidu on Sun, 25/09/2022 - 12:49

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 24 :  విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే జాతీయ స్థాయిలో రాణించవచ్చని 
శ్రీ వైష్ణవి రుజువు చేసిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ఇటీవల నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో గద్వాలకు చెందిన గౌని శ్రీ వైష్ణవి జాతీయస్థాయిలో 720 మార్కులకు గాను 656 మార్కులు సాధించి 3277వ జాతీయ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 129 వ ర్యాంకు సాధించింది.

ఘనంగా జరుపుకున్న ముందస్తు బతుకమ్మ వేడుకలు

Submitted by bheemaraidu on Sun, 25/09/2022 - 12:46

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 24 :  జోగులాంబ గద్వాల జిల్లావడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్శివ శివాని  ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో పాఠశాల ప్రిన్సిపాల్ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో,ముందస్తుబతుకమ్మవేడుకలనుఘనంగానిర్వహించారుసందర్భంగాశనివారం పాఠశాలలోని విద్యార్థినీలు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తలపై పెట్టుకుని పాటలు పాడుతూ, బతుకమ్మను తయారుచేసి సంబరాలు జరుపుకుంటూ, బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు.విద్యార్థినిలతోపాటు మహిళా ఉపాధ్యాయునీలు  కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగకు ముందు రోజు