గద్వాల్

హాస్టల్స్ లో అన్ని వసతులు సక్రమంగా ఉండాలని హెచ్చరించిన కలెక్టర్

Submitted by Thirumal on Thu, 29/09/2022 - 11:30

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-    వసతి గృహాలలో కిచెన్, వాష్ రూమ్స్, ఆవరణ అంత శుబ్రంగా ఉండేటట్లు చూసే బాధ్యత మీ  అందరిపై ఉందని సంక్షేమ వసతి గృహాలలో  పారిశుద్ధ్యం లోపించినప్పుడే వివిధ రోగాలు విద్యార్థుల దరిచేరుతాయని వాటి నిరోధానికి హాస్టల్ వార్డెన్లు, ప్రిన్సిపాల్ లు, వంట సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు, బుధవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు  జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్, వార్డెన్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి హాస్టల్ పరిసరాలు, వంట గదులు,

బాలింతలకు పౌష్టికాహారం అందించాలి:సిడిపిఓ

Submitted by Thirumal on Thu, 29/09/2022 - 11:23

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-  గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్లకు   సిడిపిఓ కమలాదేవి ఆదేశించారు బుధవారం మల్దకల్ మండల పరిధిలోని నాగర్ దొడ్డి గ్రామం  అంగన్వాడి-2 లో సిడిపిఓ కమలాదేవి సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సరియైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వ నిర్వహించే పోషక మాంసంలో పాల్గొన్నారు  గ్రామంలోని పోషక అభియాన్ గర్భిణీలకు బాలింతలకు రుణ ధాన్యాలు ఆకుకూరలు, పౌసికాహారం అందేలా చూడాలని అన్నారు తీవ్ర లోపం అతి తీవ్ర లోపం కింద గుర్తించిన పిల్లలకు తప్పనిసరిగా బాలమృతం ఉదయం సాయంత్రం అందించాలని గర్భిణీలకు పాల

కాన్పూర్ లో సీటు రావడం అభినందనీయం: జిల్లా కలెక్టర్

Submitted by Thirumal on Thu, 29/09/2022 - 11:11

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-  జోగులాంబ గద్వాల జిల్లా నుండి  అల్ ఇండియాలో జెఈ అడ్వాన్సులో 232 ర్యాంకు ను సాదించడం ఆభినందనీయమని  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు,బుధవారం కలెక్టర్ చాంబర్ లో జోగులాంబ గద్వాల్ జిల్లా  నుండి అల్ ఇండియాలో జెఈ అభినందించి పుస్తకం అందజేశారు జిల్లాకు చెందిన  ఉపాద్యాయులు లక్ష్మయ్య శెట్టి, ప్రశాంతి ల కుమారుడు సాయి నిఖిల్  చదువుతో పాటు స్పోర్ట్స్  అన్నింటిలో ముందు ఉండాలని అన్నారు,   7వ తరగతి వరకు విశ్వబారతి స్కూల్ 09,10 మరియు ఇంటర్ వరకు  శ్రీ చైతన్యలో చదివానని కోచింగ్ ఇచ్చారని కలెక్టర్ కి తెలిపారు, కాన్పూర్ నందు సీటు రావడం అభినందనీయమని నార్త్ ఇ

భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

Submitted by bheemaraidu on Wed, 28/09/2022 - 10:44

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 27:  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రాజవీది లోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాత సేవతో మొదలై అభిషేకం, కుంకుమార్చన జరిగాయి. "పరమశివునికి బిక్ష ఇచ్చిన మాత అన్నపూర్ణేశ్వర దేవి" అలంకారంలో దర్శనమిచ్చింది. ఈ అలంకారంలోని అమ్మవారిని దర్శించుకున్న వారికి మహా పుణ్యం అని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి పట్టణ అధ్యక్షులు పులిపాటి వెంకటేష్, నారాయణ కౌన్సిలర్, చిలివేరి ప్రభాకర్, సాయిబాబా, కాడికి రాము, అక్కల రవి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతి వేడుకలు

Submitted by bheemaraidu on Tue, 27/09/2022 - 16:09

గద్వాల ప్రతినిధి (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 27 :  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్, రాజీవ్ చౌక్ నందు కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ, జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పులిపాటి వెంకటేష్ మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను గురించి తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పాత్ర, ఈ ఉద్యమ బిడ్డ మన పద్మశాలి కావడం మనకెంతో గర్వకారణం అని ఆయన అన్నారు. త్వరలో పట్టణ నడిబొడ్డున కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. అని అన్నారు.

పాడి పశువుల పెంపకంతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి -- ఎంపీపీ రాజారెడ్డి

Submitted by bheemaraidu on Tue, 27/09/2022 - 15:29

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 27 :  జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం దాసరిపల్లి గ్రామంలో మంగళవారం స్పీడ్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో మరియు జపాన్ దేశం వారి ఆర్థిక సహకారంతో వడ్డీ లేని రుణాలను మహిళలకు పంపిణీ చేయడం జరిగింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా పిల్లలను వివిధ పనుల నుండి విముక్తి చేసినటువంటి బాల కార్మిక విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, దాసరిపల్లి గ్రామంలో ఆవులను రెండు కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఒక్క ఆవు యూనిట్ విలువ 30 వేల రూపాయలు.

విశ్వేశ్వరయ్యా పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Submitted by Thirumal on Tue, 27/09/2022 - 12:55

గద్వాల్ : ప్రజాజ్యోతి ప్రతినిధి;-  తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన పండుగ బతుకమ్మ పండుగను లింగంబావి కాలనిలో వున్న విశ్వేశ్వరయ్యా ఉన్నత పాఠశాలలో  ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆటపాటలతో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు, ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు భారతి ఫ్యాడ్నిస్ బతుకమ్మ పండుగ నుద్దేశించి మాట్లాడుతూ పూర్వం నవాబుల కాలంలో భూస్వామ్య పెత్తందార్లు మహిళల పట్ల అకృత్యాచేస్టాలకు భరించలేక ఆత్మహత్య చేసుకున్న మహిళలకు సాటి మహిళలు మనోధైర్యాన్ని కల్పిస్తుండేవారని అన్నారు, ఒక్కోసారి మహిళలు వేదింపులు భరించలేక బలి అయిన మహిళలను గుర్తుకు తెచ్చుకొని మహిళలంతా ఒక చోట గుమిగూడి అప్పట్లో ఆనా

ఘనంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

Submitted by bheemaraidu on Tue, 27/09/2022 - 12:54

గద్వాల ప్రతినిధి ప్రజా జ్యోతి సెప్టెంబర్ 26 :  జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో మొదటి రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి సోమవారం రోజున బాల త్రిపుర సుందరి దేవి అలంకారం లో దర్శనమిచ్చారు "పత్రి  పురాత్రయంలో శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి ప్రథమ స్థానంలో ఉంది" ఆమె ఎంతో మహిమాన్వితమైనది సమస్త దేవి మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది కావున బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలోనూ అమ్మవారిని దర్శించుకోవడం మహాభాగ్యమని పురోహితులు చెప్పారు ఆలయంలో ఉదయం అభిషేకం కుంకుమార్చన మొదలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య స

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Submitted by bheemaraidu on Tue, 27/09/2022 - 12:50

గద్వాల ప్రతినిధి ప్రజా జ్యోతి సెప్టెంబర్ 26 :  జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జరుపుకున్నారు. తాసిల్దారు హరికృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ కిరణ్, టైపిస్టు సుబ్రహ్మణ్యం, కంప్యూటర్ ఆపరేటర్ సాయి, సిబ్బంది సోమశేఖర్ ధరణి ఆపరేటర్ నవీన్ కుమార్, వెంకట్ తదితరులు ఉన్నారు.