బాలింతలకు పౌష్టికాహారం అందించాలి:సిడిపిఓ

Submitted by Thirumal on Thu, 29/09/2022 - 11:23
 Infants should be fed nutritious food: CDPO

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-  గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్లకు   సిడిపిఓ కమలాదేవి ఆదేశించారు బుధవారం మల్దకల్ మండల పరిధిలోని నాగర్ దొడ్డి గ్రామం  అంగన్వాడి-2 లో సిడిపిఓ కమలాదేవి సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సరియైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వ నిర్వహించే పోషక మాంసంలో పాల్గొన్నారు  గ్రామంలోని పోషక అభియాన్ గర్భిణీలకు బాలింతలకు రుణ ధాన్యాలు ఆకుకూరలు, పౌసికాహారం అందేలా చూడాలని అన్నారు తీవ్ర లోపం అతి తీవ్ర లోపం కింద గుర్తించిన పిల్లలకు తప్పనిసరిగా బాలమృతం ఉదయం సాయంత్రం అందించాలని గర్భిణీలకు పాలు, గుడ్లు, ఆకుకూరలు, ఐరన్ అందించాలని వారు అన్నారు అదేవిధంగా గ్రామాలలో గర్భిణీలను మల్దకల్ ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రంలో  కాన్పులు  జరగాలని ఆమె  అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు సువార్తమ్మ, ఎంపిటిసి సరోజమ్మ, ఆశ కార్యకర్తలు, అంగన్వాడి టీచర్ వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.