గద్వాల్

సహకార సంఘాల సొసైటీలు టిఆర్ఎస్ హయాంలోని బలోపేతం ౼ సింగిల్ విండో అధ్యక్షుడు

Submitted by bheemaraidu on Sat, 01/10/2022 - 12:56

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30 :   ప్రాథమిక సహకార సంఘాల సొసైటీలు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బలోపేతం అయ్యాయని మల్దకల్ మండల సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం భవనంలో మహాజన సభ నిర్వహించారు. ప్రాథమిక సహకార సంఘాలు టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని బలోపేతం చేయడం జరిగిందని, గత ప్రభుత్వాల హయాంలో సొసైటీలు నిర్వీర్యం చేశారని, రైతులు రుణాలు తీసుకొని సొసైటీకి సహకరించాలన్నారు. వడ్లు కొనుగోలు ద్వారా రైతుల నుండి రూ.3 కోట్ల 43 లక్షల రూపాయలు ధాన్యం సేకరించడం జరిగిందన్నారు.

దళిత బంధు పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలలో కొత్త యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి ౼ జిల్లా కలెక్టర్

Submitted by bheemaraidu on Sat, 01/10/2022 - 12:52

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30 : దళిత బంధు పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలలో కొత్త యూనిట్లను ఏర్పాటు చేసుకొని, లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లబ్ధిదారుల అవగాహన సదస్సుకు రాష్ట్ర షెడ్యూల్డ్ దళిత బంధు సలహాదారు (డైరీ) అడ్వైజర్ డాక్టర్ లక్ష్మారెడ్డి తో కలిసి, లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశపెట్టి అనేకమంది దళితులకు ఆర్థికంగా చేయూతను అందించిందని తెలిపారు.

శ్రీ ధనలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు

Submitted by bheemaraidu on Fri, 30/09/2022 - 16:23

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 30 :  దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి, శుక్రవారం రోజున జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు అమ్మవారు శ్రీ ధనలక్ష్మి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణకు సుమారు రెండు లక్షల 16 రూపాయల కొత్త కరెన్సీ నోట్లను ఉపయోగించినట్లు అధ్యక్షులు ఇల్లూరు నాగరాజు తెలిపారు. ఉదయం అమ్మవారి అభిషేకం, అలంకరణ, మంగళహారతి, తీర్థ ప్రసాదముల వితరణ, సాయంత్రం కుంకుమార్చనలు, సాంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి

Submitted by bheemaraidu on Fri, 30/09/2022 - 16:21

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30 :   జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో, గుర్తుతెలియని వ్యక్తి వయస్సు దాదాపు 70 సంవత్సరాలు గద్వాల శ్రీరాం నగర్ రైల్వే స్టేషన్ల మధ్య, గద్వాల పాత హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో ఎస్వీ ఈవెంట్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వెనుక, రైలు పట్టాలపై కాచిగూడ వైపు నుండి రాయచూరు వైపు వెళ్లే గూడ్స్ రైలు కింద పడి చనిపోయాడు. మృతుడు తెల్లని ఫుల్ షర్ట్, తెల్లని ధోతి మరియు నీలం రంగు ఫుల్ డ్రాయర్ ధరించి ఉన్నాడు. గద్వాల పట్టణం లేదా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వ్యక్తి అయి ఉండవచ్చును.

మల్లకల్ తిమ్మప్ప స్వామి సన్నిధిలో గద్వాల్ పట్టణ ఎస్ఐ

Submitted by bheemaraidu on Fri, 30/09/2022 - 15:18

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30:  జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని గద్వాల పట్టణ ఎస్ఐ హరి ప్రసాద్ రెడ్డి తన మాతృమూర్తి జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మధుసూదనా చారి వారికి ఆశీస్సులు అందజేశారు. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్ర రెడ్డి  శాలువతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందించారు.

ఘనంగా కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు

Submitted by bheemaraidu on Fri, 30/09/2022 - 12:55

 
గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 29 :  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పద్మశాలీయుల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గురువారం అమ్మవారు శ్రీ మూకాంబికా దేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఉదయం అభిషేకం, కుంకుమార్చన, ప్రసాదం వితరణ జరిగాయని, పద్మశాలి పట్టణ అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్, అక్కల రవి, కాడిగ రాము, పుట్ట రఘు, సుధాకర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

Submitted by bheemaraidu on Fri, 30/09/2022 - 12:53

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 29 :  జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆశ్విజ శుద్ధ చవితి గురువారం రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. నిత్యాన్న దానేశ్వరి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆధారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని, నిజక్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణాదేవి విరాజిల్లుతుంది. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్న వారికి మంచి కలుగుతుందని పురోహితులు తెలిపారు.

పిడుగుపాటుకు కాడేద్దు మృతి

Submitted by bheemaraidu on Fri, 30/09/2022 - 12:49

 ◆ 80 వేల రూపాయల ఆర్థిక నష్టం

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 29 :  జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని గుడ్డెం దొడ్డి గ్రామంలో గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎంపిటిసి సహదేవుడు రైతు యొక్క వ్యవసాయ పొలం దగ్గర కార్డు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దీనితో ఆ రైతుకు 80 వేల రూపాయల ఆర్థిక నష్టం వాటిలినట్లు రైతు ఎంపిటిసి సహదేవుడు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఆయన కోరారు.

జిల్లా అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం

Submitted by bheemaraidu on Fri, 30/09/2022 - 12:47

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 29 :  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో గురువారం అలంపూర్, వడ్డేపల్లి, ఐజ మున్సిపాలిటీలకు సంబంధించిన కమిషనర్లు టౌన్ ప్లానింగ్ అధికారులు, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, ఫారెస్ట్, ఆర్టీసీ రవాణా శాఖ, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో అధనపు కలెక్టర్ శ్రీహర్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్ మార్చిలోపు పూర్తి చేయాలని, ఇందులో భాగంగా డిసెంబర్ వరకు ఆయా మున్సిపాలిటీ కమిషనర్లు, ఇతర శాఖ అధికారులు, వారి వివరాలు సమగ్ర సమాచారం అందజేయాలని ఆదేశించారు.

అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Submitted by bheemaraidu on Fri, 30/09/2022 - 12:42

 ◆ పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 29 :  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కె. ఎస్ ఫంక్షన్ హాల్ లో గురువారం అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, కృష్ణమోహన్ రెడ్డి,గట్టు జెడ్పిటిసి బాసు శ్యామల,  అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లతో పాటు బతుకమ్మ పాటలు, ఆటలు ఆడారు.