పాడి పశువుల పెంపకంతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి -- ఎంపీపీ రాజారెడ్డి

Submitted by bheemaraidu on Tue, 27/09/2022 - 15:29
Farmers should develop economically by rearing dairy cattle -- MPP Raja Reddy

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 27 :  జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం దాసరిపల్లి గ్రామంలో మంగళవారం స్పీడ్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో మరియు జపాన్ దేశం వారి ఆర్థిక సహకారంతో వడ్డీ లేని రుణాలను మహిళలకు పంపిణీ చేయడం జరిగింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా పిల్లలను వివిధ పనుల నుండి విముక్తి చేసినటువంటి బాల కార్మిక విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, దాసరిపల్లి గ్రామంలో ఆవులను రెండు కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఒక్క ఆవు యూనిట్ విలువ 30 వేల రూపాయలు. వడ్డీ లేని రుణాలు 60 వేల రూపాయల విలువ చేసే రెండు ఆవులను మల్దకల్ మండల అధ్యక్షుడు వై రాజారెడ్డి మరియు దాసరిపల్లి సర్పంచ్ భరత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వై రాజారెడ్డి మాట్లాడుతూ స్పీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఇస్తున్నటువంటి వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. స్పీడ్ సంస్థ వారు ఇస్తున్నటువంటి ఆవులను పోషిస్తూ, పెంపకం చేసుకుంటే పాడి పశువుల ద్వారా పాలను, పాల కేంద్రాలకు మరియు ప్రజలకు అమ్ముకుంటే వచ్చే ఆదాయం ద్వారా కుటుంబ పోషణకు పిల్లల చదువులకు ఉపయోగపడతాయి. పాడి పశువుల పెంపకం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెంద గలుగుతారు. ఆవు పేడ, ఆవు మూత్రం ద్వారా మంచి ఎరువుగా ఉపయోగపడతాయి. రైతులు వాడుతున్నటువంటి రసాయనిక క్రిమిసంహారక ఎరువులు విచ్చలవిడిగా వినిగించుకోవడం వలన భూమి నందు తేమశాతం మరియు భూ పౌష్టిక విలువలు తగ్గుతున్నాయి. ఆవుల యొక్క పేడ మరియు మూత్రం యొక్క ఎరువులను వాడుకుంటే భూమి సారవంతమైన పోలాలుగా మారుతాయి అని వై రాజారెడ్డి తెలియజేశారు.

గ్రామ సర్పంచ్ భరత్ రెడ్డి మాట్లాడుతూ స్పీడ్ సంస్థ వారు మా గ్రామమును దత్తత తీసుకొని గ్రామంలోని బడిబయట ఉన్న బాల కార్మిక విద్యార్థులను చదివించడం చాలా సంతోషంగా ఉన్నది. వారి కుటుంబాలకు వడ్డీ లేని రుణాలను జపాన్ దేశం వారు ఇవ్వడం చాలా గొప్ప విశేషం. దేశం కానీ దేశం వారు పిల్లలను చదివించాలి అని వారు ముందుకు రావడం చాలా సంతోషమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటన్న, సింగిల్ విండో డైరెక్టర్ పాగుంట, స్పీడ్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్  మధులత, స్పీడ్ సంస్థ సిబ్బంది ఈరన్న నవీన్, తిమ్మరాజు, సరళ ,నరేష్, వెంకటమ్మ గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.