విశ్వేశ్వరయ్యా పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Submitted by Thirumal on Tue, 27/09/2022 - 12:55
Grand Bathukamma celebrations at Visvesvaraya School

గద్వాల్ : ప్రజాజ్యోతి ప్రతినిధి;-  తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన పండుగ బతుకమ్మ పండుగను లింగంబావి కాలనిలో వున్న విశ్వేశ్వరయ్యా ఉన్నత పాఠశాలలో  ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆటపాటలతో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు, ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు భారతి ఫ్యాడ్నిస్ బతుకమ్మ పండుగ నుద్దేశించి మాట్లాడుతూ పూర్వం నవాబుల కాలంలో భూస్వామ్య పెత్తందార్లు మహిళల పట్ల అకృత్యాచేస్టాలకు భరించలేక ఆత్మహత్య చేసుకున్న మహిళలకు సాటి మహిళలు మనోధైర్యాన్ని కల్పిస్తుండేవారని అన్నారు, ఒక్కోసారి మహిళలు వేదింపులు భరించలేక బలి అయిన మహిళలను గుర్తుకు తెచ్చుకొని మహిళలంతా ఒక చోట గుమిగూడి అప్పట్లో ఆనాటి నుండి నేటి వరకు సహజసిద్దంగా దొరికే తంగేడు పువ్వులతో పాటుగా రకరకాలు పూలను త్రివర్ణ ఆకారంలో బతుకమ్మను పేరుస్తు ఆత్మబలిదానం చేసుకున్న మహిళల త్యాగాలను పాటల మదిలో తలుచుకుంటూ సాగే పండుగ బతుకమ్మ పండుగ అని విద్యార్థులకు తెలియజేశారు, తెలంగాణ రాష్ట్రం అవతరించాక మరుగున పడిన బతుకమ్మ పండుగను విభిన్న రూపాలలో కథలు వర్ణిస్తూ సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా బతుకమ్మ పండుగను ప్రత్యేకంగా జరుపుకోవడం అద్వితీయమన్నారు.ఈ కార్యక్రమంలో పి రాధాకృష్ణ, తిమ్మారెడ్డి, పి చంద్రశేఖరయ్య, సుదర్శన్, తార్నాద్, ఇ.కృష్ణయ్య పాల్గొన్నారు.