హాస్టల్స్ లో అన్ని వసతులు సక్రమంగా ఉండాలని హెచ్చరించిన కలెక్టర్

Submitted by Thirumal on Thu, 29/09/2022 - 11:30
 The collector warned that all the facilities in the hostels should be in order

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-    వసతి గృహాలలో కిచెన్, వాష్ రూమ్స్, ఆవరణ అంత శుబ్రంగా ఉండేటట్లు చూసే బాధ్యత మీ  అందరిపై ఉందని సంక్షేమ వసతి గృహాలలో  పారిశుద్ధ్యం లోపించినప్పుడే వివిధ రోగాలు విద్యార్థుల దరిచేరుతాయని వాటి నిరోధానికి హాస్టల్ వార్డెన్లు, ప్రిన్సిపాల్ లు, వంట సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు, బుధవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు  జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్, వార్డెన్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి హాస్టల్ పరిసరాలు, వంట గదులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా  ఉండేటట్లు చర్యలు చేపట్టాలని, బోజన్నానికి ముందు  చేతులు శుబ్రపరుచుకునే విదంగా   విద్యార్థులకు ఆవగాహన కల్పించాలని, విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి హాస్టల్లో మెడికల్ స్టాఫ్ తప్పని సరిగా  ఉండాలని ఆదేశించారు, ఆర్ బి ఎస్ కె వారు ప్రతి హాస్టల్ ను తనికి చేసి ప్రతి విద్యార్థిని చెక్ చేయాలనీ, బాలికల ఆరోగ్య పరిస్థితి పరిశీలించి రక్త హీనత ఉన్న పిల్లలకు  అవసరమయ్యే ఐరన్ టాబ్లెట్లు ఇవ్వాలని  అన్నారు, విద్యార్థులు భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కుని భోజనం చేసేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు, వంట ఏజెన్సీ వారు మెనూ ప్రకారం ఏ రోజు ఏ వంట చేస్తారో  దానిని బోర్డుపై రాయాలన్నారు, విద్యార్థులలో చురుకైన వారిని ఫుడ్ కమిటీగా ఏర్పాటు చేయాలన్నారు వంట చేయువారు వంటలో వెంట్రుకలు పడకుండా తలకు క్యాప్ పెట్టుకొని వండాలన్నారు, వండిన వంటలపై మూతలుంచాలని,  కుళ్ళిపోయిన కూరగాయలు ఉంచరాదని, నాణ్యమైన కూరగాయలను వాడాలని ఆదేశించారు. 

భోజనం విషయంలో రాజీ లేకుండా నాణ్యవంతంగా వండి పెట్టె విదంగా చూడాలన్నారు.  పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి రోజు ఉదయం యోగ చేయించాలన్నారు, కొన్ని జిల్లాలలోని హాస్టల్ లలో ఫుడ్ పాయిజన్ జరిగిందని, మన జిల్లాలో అలాంటివేవీ జరుగ కుండ చూడాలని  అన్నారు, ఈ సందర్భంగా ఒక్కొక్క హాస్టల్లో ఉండే సమస్యలపై వర్దేన్లను అడిగి తెలుసుకున్నారు, పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా విద్యపై దృష్టి పెట్టాలన్నారు, పదవ తరగతి విద్యార్థులు ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ లను ఆదేశించారు, ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, డిఇఓ సిరాజుద్దీన్, ఫుడ్ క్వాలిటీ అధికారి నీలిమ, జిల్లా సంక్షేమ అధికారిని శ్వేతా ప్రియదర్శిని, పాఠశాలల ప్రిన్సిపాల్స్, వార్డెన్లు,  కెజిబివి హాస్టల్ కో అర్దినేట్టార్ లు సంబందింత   అధికారులు పాల్గొన్నారు.