బచ్చన పేట

ప్రజా సంగ్రామ ముగింపు యాత్రకు తరలిన బిజెపి నాయకులు

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:27

బచ్చన్నపేట సెప్టెంబర్ 22 ప్రజా జ్యోతి: జనగామ జిల్లా బచ్చన్న పేట మండలంలో గల  వివిధ గ్రామాల నుండి బండి సంజయ్ కుమార్ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు అధిక సంఖ్యలో వాహనాలను  మండల అధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి జెండా ఊపి తరలించడం జరిగింది.

బండనాగారం అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు... .... సిడిపిఓ రమాదేవి

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:29

బచ్చన్నపేట సెప్టెంబర్ 21ప్రజా జ్యోతి: సెక్టర్ లెవెల్ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా బుధవారం బండనాగారం గ్రామంలోని అంగన్వాడి సెంటర్లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగిందని సిడిపిఓ రమాదేవి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పై అవగాహన కల్పించడం జరిగిందని. రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు నష్టాల గురించి చెప్పడం జరిగిందని అనంతరం బండ నాగారం సర్పంచ్ శివరాత్రి కవిత ముఖ్యఅతిథిగా పాల్గొనగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగిందని ఆమె తెలిపారు.

కొన్నెల్లో ఎల్లమ్మ తల్లి ని దర్శించుకున్న నాగపురి కిరణ్

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:27

బచ్చన్నపేట సెప్టెంబర్ 21 ప్రజా జ్యోతి:  జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలం కొన్నె  గ్రామంలో రేణుక ఎల్లమ్మ పండుగా సందర్బంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెరాస నాయకుడు  నాగపూరి  కిరణ్ కుమార్ ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ పండుగా సందర్బంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని ,అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు. కొన్నే గ్రామ ప్రజలకు రేణుక ఎల్లమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో Pacs డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్ కలకుంట్ల స్వామి గౌడ్ కొల రమేష్ గౌడ్ అంబాల ప్రభాకర్ గౌడ్ ఎలికట్టే నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్.టి.ఐ కమిషన్ ముందు హాజరైన అధికారులు

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:22

బచ్చన్నపేట సెప్టెంబర్ 21 ప్రజా జ్యోతి: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవలూరు గ్రామపంచాయతీకి సంబంధించిన సమాచారం అధికారులు ఇవ్వనందున రాష్ట్ర సమాచార కమిషన్కు ఫిర్యాదు చేశానని ఆర్టిఐ కార్యకర్త మినలాపురం జలంధర్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఆర్టిఐ కింద గ్రామపంచాయతీకి సంబంధించిన సమాచారం సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరగా సంబంధించిన అధికారులు గ్రామపంచాయతీకి వచ్చి విచారణ చేశారు కానీ. విచారణ రిపోర్టులు నిర్ణీత సమయంలో ఇవ్వనందున రాష్ట్ర సమాచార కమిషన్ను కలువగా సమాచార కమిషన్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయగా.

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:08

బచ్చన్నపేట సెప్టెంబర్ 21 ప్రజా జ్యోతి: జనగామ జిల్లా బచన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మృతురాలు మార్తలక్ష్మి గత కొద్దరోజుల క్రితం చనిపోయిందని తెలియగా వాస్విక్ ఫౌండేషన్ ఛైర్మెన్ నిడిగొండ నరేష్ కుమార్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి మృతురాలు కుటుంబానికి ఫౌండేషన్ సభ్యులు ఆముధాల భూపాల్ రెడ్డి ద్వారా 50 కేజీల బియ్యం అందించడం జరిగినది. అడగగానే సహాయము అందించిన వాస్విక్ ఫౌండేషన్ కు కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రం బాల్ రాజు ,పెద్ద చిట్టి రవిందర్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారిచే విద్యార్థులకు అల్పాహారం

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 17:50

బచ్చన్నపేట సెప్టెంబర్ 20 ప్రజా జ్యోతి: జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పోచన్నపేట లో శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారి సహకారంతో జనగామ జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 31,228 మంది విద్యార్థులకు ప్రతి దినం అల్పాహారంగా రాగి పౌడర్ మరియు బెల్లం మిక్స్ ను అందించే కార్యక్రమాన్ని శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ సెక్రటరీ ఆనంద్ కడాలి గారు ప్రారంభించారు. ఆనంద్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మన భారతదేశం లో 7 లక్షల మంది విద్యార్థులకు అందిస్తున్నాం అని తెలిపారు. ఈ సంఖ్య ను మరింత పెంచి విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిద్దేందుకు అన్నపూర్ణ ట్రస్ట్ మరింత కృషి చేస్తుంది అని తెలిపారు.

షర్మిల నిరాహార దీక్షలో పాల్గొన్న చేవెళ్ల స్వామి

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 16:40

బచ్చన్నపేట సెప్టెంబర్ 20 ప్రజా జ్యోతి: ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా 2100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న వైయస్సార్ టిపి అధినేత్రి షర్మిల షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో  జనగామ నియోజకవర్గం ఇంచార్జ్ చేవెళ్ల స్వామి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూకొందుర్గు మండలంలో మంగళవారం రోజున నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తెలంగాణలో షర్మిల గారితోనే సాధ్యమని, రాబోయే కాలంలో వైఎస్ఆర్ టి పి పార్టీ అధికారంలోనికి రాబోతుందని అన్నారు.ఈ

పత్తి పురుగుతో మనిషికి ప్రమాదం కాదు

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 15:53

- సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం వాస్తవంకాదు
- మండల వ్యవసాయ శాఖ అధికారి విద్యకర్ రెడ్డి

కొన్నే గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:56

బచ్చన్నపేట సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి):  జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం. కొన్నే గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయని గౌడ సంఘం అధ్యక్షులు కోల రమేష్ అన్నారు. సోమవారం పండుగ ఉత్సవాల గురించి తెలిపారు . ఆదివారం రాత్రి పోచమ్మ బోనాలు జరిగాయని సోమవారము పుట్ట బంగారానికి పోయి గంప కప్పడం జరిగిందని అనంతరం కాటమయ్యకు మహిళలు కాటమయ్యకు బోనాలతో వెళ్లి నైవేద్యం సమర్పించారని. మంగళవారము రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించిన అనంతరం కళ్యాణ ఉంటుందని గ్రామస్తులు బంధుమిత్రులు పిల్లాపాపలతో అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. గౌడ సంఘం నాయకులు కలకుంట స్వామి.